English | Telugu

ఏప్రెల్ 21న ప్రభాస్ మిస్టర్ పెర్ ఫెక్ట్ రిలీజ్

ఏప్రెల్ 21 న ప్రభాస్ "మిస్టర్ పెర్ ఫెక్ట్" చిత్రం రిలీజ్ కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, దశరథ్ దర్శకత్వంలో, దిల్‍ రాజు నిర్మిస్తున్న చిత్రం" మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం ఏప్రెల్ 21 వ తేదీన రిలీజ్ కానుందట. యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల గండిపేటలో కల సిబిఐటి కాలేజీలో, మార్చ్ 19 వ తేదీన ఘనంగా విడుదల చేయబడింది.


ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కబడ్డీ చిట్టీ అనే పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తూండగా, మరో హీరోయిన్ తాప్సి ఇన్ ఫర్ మేషన్ టెక్నాలజీ ప్రొఫెషనల్ గా నటిస్తూండటం విశేషం. ఈ చిత్రంలో హీరో ప్రభాస్ వీడియో గేమ్స్ తయారుచేసే కంపెనీ యజమానిగా నటిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు దశరథ్ గతంలో నాగార్జున హీరోగా "సంతోషం" అనే సుపర్ హిట్‍ చిత్రానికి దర్శకత్వం వహించినా, ఆ తర్వాత అతనికి ఆ రేంజ్ హిట్టింతవరకూ రాలేదు. ఈ చిత్రం దశరథ్ కి మళ్ళీ అంత పెద్ద హిట్టవుతుందని సినీ జనాలంటున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.