English | Telugu
బిపాశా నా కోస్టార్ మాత్రమే- రానా
Updated : Mar 26, 2011
"ఈ రూమర్లు ఎవరు వ్యాపింపచేస్తారో నాకర్థం కాదు. బిపాషా బసు జస్ట్ నా కో-స్టార్ మాత్రమే అంతకు మించి మా ఇద్దరి మధ్య ఇంకే సంబంధం లేదు. అలాగే గతంలో హీరోయిన్ శ్రియతో కూడా నాకిలాంటి ఎఫైర్ ఏదో ఉందనే రూమర్ వచ్చింది. శ్రియ నాకు కాలేజ్ మేట్. గత ఎనిమిదేళ్ళుగా శ్రియ నాకు ఒక మంచి ఫ్రెండ్ గా ఉంది. అంతమాత్రానికే ఇలా ఎవరితోపడితే వారితో ఎఫైర్లు అంటగట్టటం సంస్కారం అనిపించుకోదు" అని రానా తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. హీరో అయ్యాక ఇలాంటివన్నీ తప్పదు రానా... భరించాల్సిందే. ఇలాంటివన్నీ పట్టించుకోకుండా నీ నటన మీద దృష్టి పెట్టటం ఉత్తమం.