English | Telugu

మోక్షజ్ఞ సినిమా పరిస్థితి ఏంటి.. అనిల్ రావిపూడితో చేస్తే ఎలా ఉంటుంది!


-నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఎంత వరకు వచ్చింది
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
-వాళ్ళు ఇస్తున్న సలహాలు ఏంటి!
-అనిల్ రావిపూడి ఏమంటాడు


గాడ్ ఆఫ్ మాసెస్ అనే టైటిల్ తనకి ఒక రేంజ్, వైబ్రేషన్ ఉండాలని నట సింహం బాలకృష్ణ(Balakrishna)దగ్గరకి తనతంట తానుగా వచ్చి చేరిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా తన సింహపు గర్జన లాంటి డైలాగ్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాడు. ఫ్యామిలీ, సెంటిమెంట్, జానపద, పౌరాణిక, ఫిక్షన్ చిత్రాల్లో కూడా సుదీర్ఘ కాలం నుంచి చేస్తు తెలుగు చిత్ర పరిశ్రమలో డిక్షనరీ లో ఎక్స్ పైరీ డేట్ ని డిలేట్ చేసే పని కల్పించాడు. మరి ఇంత కీర్తిని గడించిన బాలయ్య నుంచి అభిమానులు కోరుకునే అంశాల్లో వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం.

వాళ్ళ ఆశలకి తగ్గట్టుగానే కొన్ని నెలల క్రితం హనుమన్(Hanuman)ఫేమ్ ప్రశాంత్ వర్మ(Prashanth varma)డైరెక్షన్ లో మోక్షజ్ఞ(Mokshagna)డెబ్యూ మూవీకి రంగం సిద్ధమయ్యింది. రెండు రోజుల్లో అధికారకంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అవుతుందనగా వాయిదా పడింది. ప్రశాంత్ వర్మ ప్లేస్ లో వేరే దర్శకుడు ఉంటాడనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ప్రస్తుతం ఆ సినిమా ఊసునే ఎవరు ఎత్తటం లేదు. కనీసం రూమర్ గా అయినా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ న్యూస్ రావడం లేదు. దీంతో అభిమానులు మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ వస్తున్నారు.

Also read:పిడిగుద్దులుతో చితకబాదిన సాయి ధన్సిక.. మందు తాగి అతి చేస్తే ఇలాగే ఉంటది

ఇంకొంత మంది అభిమానులు అయితే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు అనిల్ రావిపూడి వెంటనే సినిమా చెయ్యడానికి ప్రస్థుతానికి పెద్ద హీరోలు ఎవరు ఖాళీగా లేరు. దీంతో మోక్షజ్ఞ తో అనిల్ రావిపూడి(anil Ravipudi) యూత్ అండ్ ఫ్యామిలీ జోనర్ లో సినిమా చేస్తే సూపర్ గా ఉంటుంది. అనిల్ రావిపూడి సినీ డిక్షనరీలో కూడా తెలుగు సినిమా అధిపతి విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు మనవడు, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ని పరిచయం చేసిన రికార్డు ఉంటుందని అంటున్నారు. మరి అభిమానుల గాలి అనిల్ రావిపూడి, బాలకృష్ణ వైపు మళ్లుతుందేమో చూడాలి. బాలకృష్ణ,అనిల్ కాంబోలో భగవంత్ కేసరి వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

కమల్ హాసన్ పై కస్తూరి కీలక వ్యాఖ్యలు.. మధ్యలో తెలుగోళ్లు వచ్చారు 

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్(Kamal Haasan)..సీనియర్ నటి కస్తూరి(kasturi).. తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన ఈ ఇద్దరు సుదీర్ఘ కాలం నుంచే తెలుగు సినిమాల్లో తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ముఖ్యంగా కమల్ సినీ గ్రాఫ్ గురించి చెప్పుకోవాలంటే రోజులు చాలవు. ఇక ఆ ఇద్దరు భారతీయుడు లో అన్నా చెల్లెళ్లుగా, తండ్రి కూతుళ్లుగా చేసి అభిమానులని తమ పెర్ ఫార్మెన్స్ తో అలరించారు. కానీ ఇప్పుడు రాజకీయంగా ప్రత్యర్థులు. ఈ విషయాన్నీ గుర్తు చేస్తు కమల్ హాసన్ పై కస్తూరి చేసిన తాజా వ్యాఖ్యలు సినీ, పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.