English | Telugu

సంక్రాంతి ముగిసింది.. మరి మొనగాడు ఎవరు?

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి సంబరం ముగిసింది. సెలవులు పూర్తి కావడంతో..సంక్రాంతి రేసులో నిలిచిన సినిమాలన్నీ అసలు పరీక్షను ఎదుర్కోవడానికి సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నిటికీ మంచి టాక్ రావడం విశేషం. దీంతో అన్ని సినిమాలూ హౌస్‌ఫుల్స్‌తో నడిచాయి. ఇప్పుడు సెలవులు పూర్తి కావడంతో...బాక్స్ ఆఫీస్ మొనగాడు ఎవరో త్వరలో తేలనుంది.

'ఎక్స్‌ప్రెస్‌ రాజా' చిన్న సినిమా కావడంతో సంక్రాంతి వసూళ్ళతో సేఫ్ జోన్ లోకి వెళ్లినట్టు ట్రేడ్ వర్గాల టాక్. మరోవైపు సంక్రాంతి రేసులో లేట్ గా వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' క్లాస్‌తోపాటు మాస్‌ సెంటర్స్‌లోనూ కొన్ని రోజులు హవా కొనసాగి౦చవచ్చని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో' 50 కోట్ల క్లబ్‌లో చేరాలంటే ఈ వారమంతా బాక్సాఫీస్‌ వద్ద స్ట్రాంగ్‌గా నిలబడక తప్పదు. మొత్తానికి సంక్రాంతిని బాగా క్యాష్ చేసుకున్న సినిమాలు ..ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా నిలబడ్తాయోనని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.