English | Telugu

మెగా157 షూటింగ్ షురూ.. మొదటిరోజు చిరంజీవితో...

మెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోంది. #Mega157 అనేది వర్కింగ్ టైటిల్. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడికి ఇది చిరంజీవితో తొలి చిత్రం కావడం విశేషం. చిరంజీవి అభిమానులు ఎప్పటి నుంచో ఆయనను మళ్లీ పూర్తి స్థాయి హ్యూమరస్ క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్నారు. వారి కోరిక ఈ చిత్రంతో తీరబోతుంది.

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార చిరంజీవికి జోడిగా నటిస్తోంది. ఈ రోజు హైదరాబాద్‌లో సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభమైంది. మొదటి రోజు డైరెక్టర్ అనిల్ రావిపూడి.. చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం'తో రీజినల్ ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నాడు అనిల్ రావిపూడి. అదే మ్యాజిక్ ని వచ్చే సంక్రాంతికి రిపీట్ చేయాలని చూస్తున్నాడు.

ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా సమీర్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్ గా ఏఎస్ ప్రకాష్, ఎడిటర్ గా తమ్మిరాజు వ్యవహరిస్తున్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.