English | Telugu

వైజాగ్ కాదు హైదరాబాద్..అంతకు మించి షురూ

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)విశ్వంభర(Vishwambhara)తర్వాత అనిల్ రావిపూడి(Anil ravipudi)దర్సకత్వంలో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలతో అధికారకంగా ప్రారంభమైన ఈ మూవీపై చిరు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి నుంచే ప్రమోషన్స్ కూడా వినూత్నంగా జరుగుతున్నాయి.చిరు ఓల్డ్ సినిమా కట్ అవుట్ లతో ప్రారంభమైన ఈ ప్రమోషన్ హీరోయిన్ నయనతార(Nayanthara)వరకు చాలా వినూత్నంగా జరిగింది. దీంతో మూవీలో ఎంటర్ టైన్ మెంట్ ఏ స్థాయిలో ఉండబోతుందో అర్ధమవుతుంది.

ఇక ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో స్టార్ట్ అవుతుందని, అనిల్ రావిపూడి అండ్ టీం ఆల్రెడీ అక్కడే ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. కానీ ఈ సినిమా షూటింగ్ నిన్న హైదరాబాద్ లో ప్రారంభమయ్యింది. చిరుతో పాటు ప్రధాన తారాగణంపై కొన్నికీలక సన్నివేశాలని చిత్రీకరించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా అధికారకంగా వెల్లడి చేసింది.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు చిరు సినిమాని కూడా అంతకు మించి హిట్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. 2026 సంక్రాంతికి వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.