English | Telugu

మెగా ఫ్యాన్స్‌.. మ‌రీ టూ మ‌చ్‌!!

మెగా ఇంటి నుంచి మ‌రో హీరో వ‌చ్చాడు. ఆయనే వ‌రుణ్‌తేజ్‌. కుర్రాడు చూడ్డానికి బాగున్నాడు. మాంచి హైటు కూడా. అయితే యాక్టింగ్ టాలెంట్ తెలీదు... ఫైట్స్ ఎలా చేస్తాడో క్లారిటీ లేదు. డాన్సింగ్ స్టామినా ఇప్పుడే చెప్ప‌లేం. అస‌లు మ‌నోడు ఏమేం చేయ‌గ‌ల‌డో ఎవ్వ‌రికీ అత్తా ప‌త్తా లేదు. కానీ మెగాఫ్యాన్స్ మాత్రం.. వ‌రుణ్‌కి అప్పుడే బిరుదు కూడా ఇచ్చేశారు మెగా ప్రిన్స్ అని. ఆలూలేదు చూలూ లేదు - కొడుకు పేరు సోమ‌లింగం అన్న‌ట్టు లేదూ ఈ వ్య‌వ‌హారం. స్టార్ ఇంటి నుంచి వ‌చ్చినంత మాత్రాన తొలి అడుగులోనే ఎవ‌రూ స్టార్ కాదు.. కాలేరు. ఆఖ‌రికి బ‌న్నీ కూడా ఎప్ప‌టికో స్టైలీష్ స్టార్ అనే కిరీటం ద‌క్కించుకొన్నాడు. మెగా ప‌వ‌ర్‌స్టార్ అనేది చ‌ర‌ణ్‌కి రెండు మూడు సినిమాలు చేస్తే గానీ రాలేదు. అలాంటిది వ‌రుణ్ విష‌యంలో ఫ్యాన్స్ మ‌రీ టూమ‌చ్ చేస్తున్నార‌ని అనిపిస్తోంది. ఇలాంటి బిరుదులు ఇప్పుడే ఇచ్చేయ‌డం వ్య‌క్తిగ‌తంగా వ‌రుణ్‌కీ మంచిది కాదు. త‌న‌పై లేనిపోని హైప్ ఫ్యాన్సే క్రియేట్ చేసిన‌ట్టు ఉంటుంది. ముందు మ‌నోడికి స్వేచ్ఛ‌గా న‌టించ‌మ‌నండి, మంచి సినిమాలు తీయ‌మ‌నండి, కొన్ని మ‌ధుర‌మైన హిట్లు కొట్ట‌మ‌నండి. తెర‌పై నిజంగానే ప్రిన్స్‌లా క‌నిపించ‌మ‌నండి. అప్పుడు ఎలా పిలుచుకొన్నా, ఎంత‌లా కీర్తించుకొన్నా ఎవ్వ‌రికీ అభ్యంత‌రం లేదు. అందాక కాస్త ఆగండి.. ప్లీజ్‌.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.