English | Telugu
నందమూరి హరికృష్ణ కుమారుడు జానకీరామ్ దుర్మరణం
Updated : Dec 6, 2014
తెలుగుదేశం పార్టీ నేత, నటుడు నందమూరి హరికృష్ణ కుటుంబంలో పెను విషాదం జరిగింది. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా రోడ్డు మూల మలుపులో రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రాక్టర్ ఆయన కారును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ వార్త విని నందమూరి హరికృష్ణ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అమెరికాలో స్థిరపడిన జానకిరామ్ ఇండియాకి వచ్చి ఇలా యాక్సిడెంట్‌లో మరణించడం ఈ కుటుంబానికి ఊహించని పరిణామం. యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ సమాచారాన్ని హరికృష్ణకి అందించారు. పిడుగుపాటు లాంటి ఈ వార్త విని హరికృష్ణ కుటుంబం కుప్పకూలిపోయింది.
