English | Telugu

రోజు రోజుకీ పెరుగుతున్న మంజు క్రేజ్‌!

మంజు వారియ‌ర్ పేరు ఇంత‌కు ముందు మ‌న‌కు పెద్ద‌గా తెలుసో లేదో గానీ, లూసిఫ‌ర్ సినిమా పుణ్య‌మా అని ఇప్పుడు చాలా బాగా తెలుసు. మోహ‌న్‌లాల్ చెల్లెలి కేర‌క్ట‌ర్‌లో ఇచ్చిప‌డేసింది మంజు వారియ‌ర్‌. ఆ సినిమా త‌ర్వాత మంజు వారియ‌ర్ ఏ మూవీస్‌ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఏ లాంగ్వోజ్‌లో సినిమాలు చేస్తున్నారు? ఆమె అభిరుచులు ఏంటి? వంటి ఆరాలు ఎక్కువ‌య్యాయి. దీంతో, ఆమె కేవ‌లం మ‌ల‌యాళ సినిమా రంగంలోనే కాదు, మూవీ లవ‌ర్స్ అంద‌రిలోనూ డిస్క‌ష‌న్స్ లో ఉంటున్నారు. ఆమె చేతినిండా ఇప్పుడు మ‌ల‌యాళం సినిమాలు ఉన్నాయి. అయినా కాల్షీట్‌ని అడ్జ‌స్ట్ చేసుకుని ఓ త‌మిళ మూవీకి డేట్లు ఇచ్చారు. ఆర్య‌, గౌత‌మ్ కార్తిక్ న‌టిస్తున్న మిస్ట‌ర్ ఎక్స్ లో కీ రోల్ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు మంజు వారియ‌ర్‌. మ‌ను ఆనంద్ డైర‌క్ట్ చేస్తున్న సినిమా ఇది. ఇంత‌కు ముందు విష్ణు విశాల్‌తో ఎఫ్ ఐ ఆర్ సినిమాను తెరకెక్కించారు మ‌ను ఆనంద్‌.

మ‌ను ఆనంద్ ద‌ర్శ‌కత్వంలో మిస్ట‌ర్ ఎక్స్ సినిమాలో మంజు వారియ‌ర్ యాక్ట్ చేస్తున్నార‌నే విష‌యాన్ని అఫిషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది ప్రిన్స్ పిక్చ‌ర్స్ టీమ్‌. సోష‌ల్ మీడియాలో ఈ న్యూస్‌ని అనౌన్స్ చేశారు. ఆమె పోస్ట‌ర్ కూడా అల‌రిస్తోంది. పోస్ట‌ర్ మీద ఉన్న తుపాకి, ఆమె ముఖం మీద ఉన్న చిరున‌వ్వు మిస్ మ్యాచ్ అవుతాయి. స‌మ్‌థింగ్ ఫిష్షీ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. మంజు మేమ్‌తో ప‌నిచేస్తున్నందుకు ఆనందంగా ఉంద‌ని అన్నారు గౌత‌మ్ కార్తిక్‌. ఈ ఏడాది ఆమె న‌టించిన తునివు విడుద‌లైంది. ఈ సినిమా నుంచే ఆమెకు అజిత్‌తో ఫ్రెండ్‌షిప్ మొద‌లైంది. వీరిద్ద‌రూ క‌లిసి బైక్ రైడ్స్ వెళ్తుండ‌టం గ‌మ‌నార్హం.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.