English | Telugu

కన్నప్ప హార్డ్ డ్రైవ్ కేసులో మంచు విష్ణు ట్వీట్..ఉన్న సినిమా ఇదే 

కన్నప్ప(Kannappa)సినిమాకి సంబంధించి కీలకమైన కంటెంట్ ఉన్న 'హార్డ్ డ్రైవ్‌'(Hard Drive)ని హైదరాబాద్(Hyderabad)ఫిలింనగర్ లో ఉన్న 24 ఫ్రేమ్స్' సంస్థలో పని చేస్తున్న రఘు, చరిత తీసుకొని పారిపోవడం జరిగింది. దీంతో సదరు సంస్థలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న విజయ్ కుమార్ పారిపోయిన ఇద్దరిపై పోలీసులకి ఫిర్యాదు చేసాడు. హార్డ్ డిస్క్ లో గంట ముప్పై నిమిషాల నిడివితో కూడిన సినిమా ఉందని కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఇప్పుడు ఈ విషయంపై మంచు విష్ణు(Manchu Vishnu)ఎక్స్(X)వేదికగా స్పందిస్తు 'జటా జూటదారి నీ కోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామి, హరహరమహాదేవ్(Hara Hara Mahadev)అంటు ట్వీట్ చేసాడు. సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు విష్ణుకి దైర్యం చెప్తున్నారు.

మంచు విష్ణు, మోహన్ బాబు లో ఎంతో ప్రెస్టేజియస్ట్ గా తీసుకొని 'కన్నప్ప' ని సుమారు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కగా, పాన్ ఇండియా లెవల్లో జూన్ 27 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ప్రభాస్(Prabhas),మోహన్ లాల్(MohanLal), అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి భారీ కాస్టింగ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. 'మహాభారతం' ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh)దర్శకత్వం వహించాడు.