English | Telugu

థియేటర్ల బంద్ విషయంలో పడిన తొలి వికెట్

జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)రీసెంట్ గా ఒక ప్రకటన విడుదల చేస్తు 'థియేటర్స్ బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలి. ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన(Janasena)తరఫు వాళ్ళు ఉన్నా చర్యలకు వెనకాడద్దని ఆదేశాలు జారీ చెయ్యడం జరిగింది.


దీంతో థియేటర్స్ బంద్ అనే మాటని తొలుత చెప్పింది తూర్పు గోదావరి కేంద్రంలోని రాజమండ్రి కి చెందిన జనసేన ఇన్ ఛార్జ్ అత్తిసత్యనారాయణగా గుర్తించారు. రాజమండ్రి జనసేన ఇన్ ఛార్జ్ పదవి నుంచి సత్యనారాయణని తొలగిస్తున్నట్టు జనసేన పార్టీ ఒక లేఖని జారీ చేసింది. సదరు ఉత్తర్వులలో థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో మీ భాగస్వామ్యం ఉందనే తీవ్ర ఆరోపణలు రావడంతో జనసేన పార్టీ లోని మీ సభ్యత్వాన్ని, ఇన్ ఛార్జ్ పదవిని రద్దు చేస్తున్నాం. మీ పై వచ్చిన ఆరోపణలు సత్యమా, అసత్యమా అని నిరూపించుకునే వరకు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని ఆదేశిస్తున్నట్టు కూడా లేఖలో పేర్కొంది.

టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వహణ విషయం కావచ్చు. ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చెయ్యాలి. కొత్త చిత్రాల విడుదల సమయంలో టికెట్ ధరల పెంపు కావాలంటే, నిర్మాతలు, వారికి సంబంధించినవారు వ్యక్తిగత హోదాలో కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇవ్వాలి. నా సినిమా హరిహర వీరమల్లు కి ఇదే రూల్ వర్తిస్తుంది. ఇందులో తరతమబేధాలు పాటించకూడదని కూడా పవన్ తన ఆదేశాల్లో పేర్కొన్నాడు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.