English | Telugu

లైఫ్ లో తోడు అవసరం లేదు.. నాకైతే ఒత్తిడిగా ఉంది 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ రాజమౌళి కాంబోలో వచ్చిన మూవీ యమదొంగ. అందులో ఎన్టీఆర్ కి డబ్బులు అప్పుగా ఇచ్చే ధనలక్ష్మి క్యారక్టర్ లో అద్భుతంగా నటించిన భామ మమతా మోహన్ దాస్(mamta mohandas)ఈజీ నటన ఆమె బలం. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో విభీమన్నమైన పాత్రలని పోషించి మంచి నటిగా గుర్తింపుని పొందింది. కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్ భారిన పడింది. ఇప్పుడు ఆ వ్యాధి నుండి కోలుకొని రీ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి అప్ కమింగ్ మూవీ మహారాజా(maharaja)ఈ నెల 14 న విడుదల కాబోతుంది. మమతా మోహన్ దాస్ హీరోయిన్ గా చేస్తుంది. మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా డేటింగ్ గురించి పలు ఆసక్తికర విషయాల్ని చెప్పింది. లాస్ ఏంజిల్స్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించాను.కానీ ఎక్కువ రోజులు ఆ బంధం నిలవలేదు. లైఫ్ లో రిలేషన్ ఉండాలి. కానీ అది ఒత్తిడితో కూడిన బంధంగా ఉండకూడదు. అసలు జీవితానికి ఒక తోడు అవసరమనే విషయంతో నేను ఏకీభవించను. ప్రస్తుతానికి చాలా సంతోషంగా ఉన్నాను. కాకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. మంచి జీవిత భాగస్వామి కోసం మాత్రం అయితే వెతుకుతున్నా.సమయం వచ్చినపుడు అన్ని బయటకి వస్తాయి అని చెప్పింది.

మమతా మోహన్ దాస్ మంచి సింగర్ కూడాను. ఎన్టీఆర్ రాఖి మూవీలోని టైటిల్ సాంగ్ రాఖీ రాఖీ నా కవాసకి, అలాగే శంకర్ దాదా జిందాబాద్ లోని ఆకలేస్తే అన్నం పెడతా తన గళం నుంచి జాలు వారినవే. ఆ రెండే కాదు చాలా సినిమాల్లో పాటలు పాడింది. వార్తల్లో ఇతర బాషా చిత్రాలు ఉన్నాయి. నటిగాను ఇతర బాషా చిత్రాల్లోను నటించింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.