English | Telugu

అఫీషియల్.. 'దేవర' రిలీజ్ డేట్ మారింది...

అక్టోబర్ 10న విడుదల కావాల్సిన 'దేవర' (Devara) మూవీ సెప్టెంబర్ 27 కి ప్రీ పోన్ అవుతుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా చిత్ర బృందం నుంచి ప్రకటన వచ్చింది. ఈ సినిమా నిజంగానే సెప్టెంబర్ 27 కి ప్రీ పోన్ అయింది.

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'దేవర'. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తోంది. నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ ఆలస్యం మరియు ఇతర కారణాల వల్ల అక్టోబర్ 10 కి వాయిదా పడింది. అయితే ఇప్పుడు అనుకున్న దానికంటే ముందే అవుట్ పుట్ రెడీ అవుతుండటం, మంచి డేట్ దొరకడంతో.. మళ్ళీ రిలీజ్ డేట్ ని మార్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27 న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఓ రకంగా ఇది బెస్ట్ డేట్ అనే చెప్పాలి. సోలో రిలీజ్ తో పాటు.. గాంధీ జయంతి, దసరా హాలిడేస్ వంటివి కలిసి రానున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే.. వసూళ్ల వర్షం కురిసే అవకాశముంది.

అనిరుధ్ సంగీతం అందిస్తున్న 'దేవర' చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.