English | Telugu

నాతో అసభ్యంగా ప్రవర్తించారు..ప్రభాస్ కొత్త మూవీ హీరోయిన్ సంచలన ఆరోపణ

సూపర్ స్టార్ రజనీకాంత్ ( rajinikanth) హీరోగా వచ్చిన పేట మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన నటి మాళవిక మోహన్. ఆమె ఎంత అందంగా ఉంటుందో ఆమె నటన కూడా అంతే అందంగా ఉంటుంది. లేటెస్ట్ గా ప్రభాస్ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడికి చెందిన ఒక వార్త ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది.

మాళవిక మోహన్( Malavika Mohanan) రీసెంట్ గా ఇండిగో కంపెనీ కి చెందిన విమానంలో జైపూర్ నుంచి చెన్నై కి వచ్చింది. ఆ తర్వాత విమాన సిబ్బంది సోదాల పేరుతో తనని చాలా ఇబ్బంది పెట్టారని అంతే కాకుండా అనుచితంగా కూడా ప్రవర్తించాలని మాళవిక చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తనకి జరిగిన అవమానం గురించి వివరిస్తు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్స్ కూడా మాళవికకి సపోర్ట్ గా నిలుస్తున్నారు.

మాళవిక తాజాగా తంగలాన్ (thangalaan)అనే మూవీలో నటిస్తుంది. అత్యంత భారీ బడ్జట్ తో రూపొందుతున్న ఆ మూవీలో చియాన్ విక్రమ్ (vikram) హీరోగా నటిస్తున్నాడు. అలాగే మారుతీ (maruthi) దర్శకత్వంలో ప్రభాస్ (prabhas) హీరోగా రూపొందుతున్న మూవీలో కూడా మాళవిక మెరవనుంది. ఆ మూవీకి రాజా డీలక్స్ అనే పేరు ప్రచారంలో ఉంది. మాళవిక గతంలో విజయ్ (vijay) తో మాస్టర్ ధనుష్ (dhanush)తో మారన్ మూవీల్లోను నటించింది.