English | Telugu

16 ఏళ్ల త‌రువాత మ‌హేష్ మ‌రో ప్ర‌య‌త్నం

1 నేనొక్క‌డినే, ఆగ‌డు.. ఇలా రెండు వ‌రుస ప‌రాజ‌యాల త‌రువాత ప్రిన్స్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న చిత్రం శ్రీ‌మంతుడు. మిర్చి వంటి ఘ‌న విజ‌యం సాధించిన సినిమాతో ద‌ర్శ‌కుడుగా తొలి అడుగులు వేసిన కొర‌టాల శివ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా జులై 17న విడుద‌ల‌కు ముస్తాబ‌యింది. విశేష‌మేమిటంటే.. 16 ఏళ్ల త‌రువాత మ‌హేష్‌బాబు హీరోగా న‌టించిన ఓ సినిమా జులై నెల‌లో రావ‌డం మ‌ళ్లీ శ్రీ‌మంతుడు విష‌యంలోనే. అప్పుడెప్పుడో మ‌హేష్ హీరోగా ప‌రిచ‌య‌మైన రాజ‌కుమారుడు చిత్రం జులై నెల‌లో విడుద‌లైతే.. ఇప్పుడు మ‌ళ్లీ శ్రీ‌మంతుడు అదే నెల‌లో రాబోతోంది. రాజ‌కుమారుడు స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో.. శ్రీ‌మంతుడు కూడా అదే సెంటిమెంట్‌ని ఫాలో అయి హిట్ లిస్ట్‌లో చేరుతుందేమో చూడాలంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.