English | Telugu
మహేష్‌బాబు ‘మగాడు’..!
Updated : Oct 6, 2014
సూపర్ స్టార్ మహేష్‌బాబు, కొరటాల శివతో చేయబోయే సినిమాకి ‘మగాడు’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మొదట ఈ సినిమాకి కన్నయ్య’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికి, ఈ సినిమా యూనిట్ ‘మగాడు’ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో ఈ నెల 9 నుంచి ప్లాన్ చేసారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత బ్యాంకాక్లో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తేలుస్తోంది. 'ఆగడు' సినిమా ఫ్లాప్ కావడంతో ఈ సినిమాలో చాలా మార్పులు జరిగాయట. ‘మగాడు’ ఎలాగైన హిట్ కొట్టాలని కసితో వున్నాడట మహేష్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రానికి ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మాతలు.