English | Telugu

మ‌హేష్ పారితోషికం వెన‌క్కిచ్చాడా?

మ‌న హీరోలు మ‌రీ మ‌రీ మంచోళ్ల‌యిపోతున్నారు. ర‌భ‌స సినిమా ఫ్లాప్ అయితే.. త‌న వాటాగా పారితోషికం నుంచి మూడు కోట్లు వ‌దులుకొన్నాడు ఎన్టీఆర్‌. ఇప్పుడు మ‌హేష్‌బాబు కూడా అదే బాట‌లో న‌డిచాడ‌ని టాలీవుడ్ టాక్‌. త‌న తాజా చిత్రం ఆగ‌డు భారీ న‌ష్టాల‌కు గురైంది. ఈ సినిమా విడుద‌ల‌కు ముందొచ్చిన హైప్‌తో.. సినిమాని ఫ్యాన్సీ రేట్ల‌కే అమ్ముకొన్నారు నిర్మాత‌లు. కాబ‌ట్టి... వాళ్లు సేఫ్‌. కానీ బ‌య్య‌ర్లు బ‌లైపోయారు. కోటి రూపాయ‌లు పెట్టికొంటే... రూ.40 ల‌క్ష‌లు కూడా రాని ప‌రిస్థితులున్నాయి. దాదాపుగా అంద‌రిదీ ఇదే ప‌రిస్థితి. మ‌హేష్ ముందు కూడా త‌మ దీన స్థితిని విన్న‌వించుకొంటూ బయ్య‌ర్లు బోరుమ‌న్నార‌ట‌. దాంతో మ‌హేష్ కూడా క‌రిగిపోయాడ‌ట‌. త‌న పారితోషికం నుంచి రూ.5 కోట్లు తిరిగిచ్చేశాడ‌ట‌. ఈ మొత్తాన్ని బ‌య్య‌ర్ల‌కు తిరిగి చెల్లించ‌మ‌ని నిర్మాత‌ల‌కు సూచించాడ‌ట‌. రూ.5 కోట్ల‌తో బ‌య్య‌ర్ల భారీ న‌ష్టాలు పూడ్చ‌లేరు. కానీ మ‌హేష్ ఉదార‌త‌... బ‌య్య‌ర్ల‌కు బోలెడంత భ‌రోసా ఇచ్చింద‌ట‌. అంతేకాదు.. త‌న త‌ర‌వాతి సినిమాని వీలైనంత త‌క్కువ రేట్ల‌కు వ‌చ్చేలా చూస్తాన‌ని మ‌హేష్ మాటిచ్చాడ‌ట‌. దాంతో బ‌య్య‌ర్లు రిలాక్స్‌డ్‌గా ఫీల‌వుతున్నారు. ఈ న‌ష్టాలు పూడ్చాల్సిన బాధ్య‌త మ‌హేష్ తాజా చిత్రంపై ప‌డింది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.