English | Telugu

దోలారిధని లో గ్రాండ్ గా జరిగిన వీబి ఎంటర్‌టైన్‌మెంట్ బుల్లితెర అవార్డ్స్

ప్రముఖ మార్కెటింగ్ సంస్థ వీబి ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి వార్షికోత్సవ వేడుక సందర్భంగా నిర్వహించిన బుల్లితెర అవార్డ్స్ కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ప్రముఖ నటులు రాళ్ళపల్లి గారిని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. బుల్లితెర నందు వివిధ రంగాలలో నటించిన నటీ నటులకు, విశిష్ట అతిధిగా వచ్చిన ఐపీఎస్ శ్రీ మాగంటి కాంతారావు గారి చేతుల మీదగా అవార్డ్స్ ప్రధానం చేశారు. అలాగే శ్రీ యన్ వెంకటేశ్వరావు గారు, శ్రీ సారేపల్లి గారి చేతుల మీదగా కొన్ని అవార్డ్స్ ప్రధానం చేయించారు. అలాగే ఆర్ధికంగా వెనుకబడిన కళాకారులకు వీబి ఎంటర్‌టైన్‌మెంట్ మానేజింగ్ డైరెక్టర్ ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ అవార్డ్స్ కార్యక్రమలో బుల్లితెర తారలు, తదితరులు పాల్గొని సందడి చేశారు. బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు కూడా ఈ కార్యక్రమలో తనదైన శైలిలో సందడి చేశాడు. రెడీయో మిర్చి, తెలుగు వన్ ఈ కార్యక్రమానికి న్ లైన్ మీడియా పార్టనర్ గా వ్యవహరించాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.