English | Telugu
నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, చప్పట్లు కొట్టేలా చేస్తుంది.. మహేష్ బాబు తాజా ట్వీట్ వైరల్
Updated : Jun 23, 2025
బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడైన 'అమీర్ ఖాన్'(aamir khan) ఈ నెల 20 న 'సితారే జమీన్ పర్'(Sitaare Zameen Par) అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అమీర్ హిట్ మూవీస్ లో ఒకటైన 'తారే జమీన్ పర్' కి సీక్వెల్ గా 'సితారే జమీన్ పర్' తెరకెక్కింది. మానసిక దివ్యాంగులుని తక్కువ చేసి చూడకూడదనే సందేశానికి, వినోదాత్మకాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మూవీ చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)'ఎక్స్ 'వేదికగా 'సితారే జమీన్ పర్' గురించి స్పందిస్తు మూవీ అద్భుతం. అమీర్ ఖాన్ ఇతర క్లాసిక్ మూవీస్ లాగానే సితారే జమీన్ పర్ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, చప్పట్లు కొట్టేలా చేస్తుంది. మూవీ చూసాక ఖచ్చితంగా చిరునవ్వుతో బయటకి వస్తారని ట్వీట్ చేసాడు. ఆర్ ఎస్ ప్రసన్న దర్శకత్వంలో వచ్చిన 'సితారే జమీన్ పర్' లో జెనీలియా, అరౌష్ దత్త, గోపి కృష్ణన్ వర్మ, నమన్ మిశ్రా, వేదాంత శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
90 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం జరుపుకున్న ఈ మూవీ ఇప్పటి వరకు మూడు రోజులకి 54 .70 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.