English | Telugu

బాబు బ్యాండ్ కడితే బాక్సాఫీస్ కి బ్యాండే!

'అతడు', 'ఖలేజా' చిత్రాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ కెరీర్ లో 28వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మాస్ ఎలిమెంట్స్ ఉండేలా త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి లీక్ అయిన ఫోటో ఒకటి మహేష్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది.

ఇటీవల 'ఎస్ఎస్ఎంబి 28' చిత్రీకరణ మొదలైంది. తాజాగా సెట్స్ నుంచి ఒక ఫోటో లీక్ అయింది. అందులో చెక్స్ షర్ట్ ధరించి, తలకి రెడ్ బ్యాండ్ కట్టుకొని ఉన్న మహేష్.. దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ తో మాట్లాడుతున్నాడు. ఇది సినిమాలో ఇంట్రడక్షన్ సీక్వెన్స్ అని తెలుస్తోంది. ఇంట్రో ఫైట్ తర్వాత వచ్చే సాంగ్ లో మహేష్ ఇలా బ్యాండ్ తో కనిపించనున్నాడని సమాచారం.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఫోటో చూసి మహేష్ ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. గతంలో మహేష్ 'పోకిరి' ఇంట్రో సాంగ్ లో, 'శ్రీమంతుడు' ఇంట్రో సాంగ్ లో ఇలాగే బ్యాంగ్ కట్టుకొని కనిపించాడు. ఆ రెండు సినిమాలూ ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు మహేష్ మరోసారి బ్యాండ్ కట్టుకొని కనిపించడంతో.. బాబు బ్యాండ్ కడితే బాక్సాఫీస్ కి బ్యాండే అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.