English | Telugu

'భారతీయుడు-2' విడుదలపై మదురై కోర్టు కీలక తీర్పు!

'భారతీయుడు-2' (Indian 2) సినిమాకు మదురై కోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలపై స్టే ఇవ్వలేమని మదురై కోర్టు పేర్కొంది. దీంతో 'భారతీయుడు-2' విడుదలకు రూట్ క్లియర్ అయింది. (Bharateeyudu 2)

రాజేంద్రన్‌ రాసిన ‘మర్మకళ’ పుస్తకం ఆధారంగా ‘భారతీయుడు’(1996) చిత్రంలోని కొన్ని సీన్స్‌ను చిత్రీకరించారు. ఆ సమయంలో రాజేంద్రన్‌ ను సంప్రదించి ఆయన అంగీకారంతో సినిమా తీశారు. అయితే ఇప్పుడు భారతీయుడు-2 కోసం తన అనుమతి తీసుకోకుండానే, తన పుస్తకం ఆధారంగా సన్నివేశాలు తీశారంటూ రాజేంద్రన్ కోర్టును ఆశ్రయించాడు. మర్మకళ సన్నివేశాలపై అభ్యంతరం తెలిపిన ఆయన.. సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని ని కోరారు. అయితే పార్ట్‌-1లోని సన్నివేశాలను కొనసాగించామని నిర్మాతలు కోర్టుకి తెలిపారు. వాదనలు విన్న కోర్టు.. రాజేంద్రన్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది. సినిమా విడుదలపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో రేపు(జూలై 12) భారతీయుడు-2 చిత్రం థియేటర్లలో అడుగు పెట్టనుంది.