English | Telugu

బాల‌య్య బాదేశాడు

లెజెండ్‌తో సూప‌ర్ ఫామ్ లోకి వ‌చ్చేశాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. అంత‌టి హిట్ త‌ర‌వాత వ‌స్తున్న సినిమాపై సాధార‌ణంగానే అంచ‌నాలు రెట్టింపు అవుతాయి. ల‌య‌న్‌పైనా అభిమానులు భారీ ఆశ‌లు పెట్టుకొన్నారు. డిసెంబ‌రు 31 అర్థరాత్రి టీజ‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చాక ఈ సినిమాపై హోప్స్ మ‌రీ ఎక్కువ‌య్యాయి. అందుకే బాల‌య్య సినిమాకి భారీ శాటిలైట్ రైట్ ప‌లికింది. ఈసినిమాకి జెమినీ సంస్థ రూ.8.5 కోట్ల‌కు కొనుగోలు చేసింద‌ని టాక్‌. ఆడియో బ‌య‌ట‌కు రాకుండానే ఈసినిమాకి ఇంత రేటు ప‌ల‌క‌డం ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల్ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో టాక్ తెలుసుకోకుండానేఓ సినిమాని కొన‌డానికి టీవీ ఛాన‌ళ్లు సిద్ధ‌ప‌డ‌డం లేదు. అలాంటిది ఆడియో కూడా విన‌కుండా ఈసినిమాని కొనేసింది జెమిని. బాల‌య్య సినిమాపై న‌మ్మ‌కం అలాంటిది.