English | Telugu
హీరోయిన్ల జీవితాలతో ఆడుకొంటున్నాడు
Updated : Nov 14, 2015
ఎప్పుడూ ఎవరినో ఒకరిని కెలకందే వర్మకి నిద్రపట్టదు. ఈమధ్య సినిమాలు తీయడం కంటే ట్విట్టర్లలో వెర్రి కూతలు కూయడానికే టైమ్ అంతా కేటాయించాడు. మధ్యలో గ్యాప్ వస్తే... ఓ పుస్తకం కూడా రాసేశాడు. గన్స్ అండ్ థైస్ పేరుతో ఈ పుస్తకం విడుదల కానుంది. తుపాకులతో, తొడలతో తనకున్న సంబంధ బంధవ్యాలను వర్మ తనదైన స్టైల్లో రాసుకొచ్చాడట.
గన్స్ అంటే అండర్ వరల్డ్ మాఫియా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. ఇక తొడలు గురించి అంటే.. కథానాయికలతో తనకున్న అక్రమ సంబంధాలే అన్నది సుస్పష్టం. ఈ పుస్తకంలో కొంతమంది హీరోయిన్ల గురించి ప్రస్తావించాడట వర్మ. హీరోయిన్ల శృంగార పరమైన విషయాల్ని సిగ్గు లేకుండా రాసుకొచ్చాడట. అవి బయటకు వస్తే.. తమ పరువు ఏమైపోతుందో అని కంగారు పడుతున్నారు.. వర్మతో సన్నిహితంగా మెలిగిన కొంతమంది కథానాయికలు. అప్పుడే వర్మకు హీరోయిన్లు ఫోన్లు చేసి `మన వ్యవహారం బట్టబయలు చేయొద్దు ప్లీజ్` అంటూ వేడుకొంటున్నాట.
కొంతమంది కథానాయికలకు పెళ్లిళ్లయిపోయి, సుఖంగా వైవాహిక జీవితం గడపుతున్నారు. అలాంటివాళ్ల ప్రస్తావన కూడా ఈ పుస్తకంలో ఉందట. మొత్తానికి తన పుస్తకాన్ని అమ్ముకోవడానికి, తనకు మరికొంత పబ్లిసిటీ రావడానికి కథానాయికల జీవితాలతో ఆడుకోవడం మొదలెట్టాడు వర్మ. అండర్ వరల్డ్ వల్ల తనకెలాంటి ముప్పూ లేదు. ఎందుకంటే వాళ్లని కెలికే పని వర్మ ఎప్పటికీ చేయడు. ఇక మిగిలింది కథానాయికల గురించే. అందుకే.. తన వెర్రిరాతలతో వాళ్లని బలి చేద్దామని డిసైడ్ అయ్యాడేమో.