English | Telugu
నిరుడు `ఉప్పెన`.. ఈ ఏడాది `డీజే టిల్లు`..!
Updated : Feb 9, 2022
గత ఏడాది సంచలన విజయాల్లో `ఉప్పెన` ఒకటి. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిని హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా.. 2021 ఫిబ్రవరి 12న తెరపైకి వచ్చింది. ఈ చిత్రంతోనే సుకుమార్ వద్ద శిష్యరికం చేసిన బుచ్చిబాబు సానా దర్శకుడిగా తొలి అడుగేశాడు. మొదటి ప్రయత్నంలోనే మెమరబుల్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.
Also Read:లతా మంగేష్కర్ భౌతికకాయం వద్ద షారుఖ్ ఉమ్మేశాడా.. అసలు నిజమేంటి?
కట్ చేస్తే.. ఈ ఏడాది కూడా అదే ఫిబ్రవరి 12న మరో కొత్త దర్శకుడు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అతడే.. విమల్ కృష్ణ. యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ నటించిన `డీజే టిల్లు`తో విమల్ కెప్టెన్ గా అరంగేట్రం చేస్తున్నాడు. యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. మరి.. గత ఏడాది పాపులర్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన `ఉప్పెన`తో ఎలాగైతే డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు మంచి విజయం అందుకున్నాడో.. అలాగే ఈ ఏడాది మరో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసిన `డీజే టిల్లు`తో నూతన దర్శకుడు విమల్ కృష్ణ కూడా శుభారంభం అందుకుంటాడేమో చూడాలి.