English | Telugu
కొరటాల శివకి హీరో కష్టాలు
Updated : Jul 1, 2025
రైటర్ గా సినీ కెరీర్ ని ప్రారంభించి దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన చిత్రాలని ప్రేక్షకులకి అందించారు 'కొరటాల శివ'(Koratala Siva). మిర్చి,శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్, దేవర వంటి విజయవంతమైన చిత్రాలే అందుకు ఉదాహరణ. పైగా ఆయా చిత్రాలన్నీ బడా హీరోలవి కావడంతో పాటు సదరు హీరోల కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచాయి. దీన్ని బట్టి దర్శకుడిగా కొరటాల శివ రేంజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.
కానీ ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ నుంచి తదుపరి సినిమా ఎప్పుడు వస్తుందనే క్లారిటీ లేదు. ఎన్టీఆర్(Ntr)నే స్వయంగా దేవర 2(Devara 2)ఉందని ప్రకటించినా, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్(Trivikram)కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మైథలాజికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్న ఈ మూవీకి సంబంధించి ఎన్టీఆర్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసాడు. మూవీలోని తన క్యారక్టర్ కోసం మురుగన్ పుస్తకాన్ని చదువుతున్న ఎన్టీఆర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యి ప్రేక్షకుల ముందుకు రావడానికి మూడు సంవత్సరాలు అయినా పట్టవచ్చు. మరి ఆ తర్వాత దేవర 2 ఉంటుందా లేదా అనేది డౌట్. మరి ఈ లోపు వేరే హీరోలు ఎవరినైనా ట్రై చేద్దామని అనుకుందామంటే పెద్ద హీరోలు ఎవరు ఖాళీగా లేరు. నాని, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు కూడా మరో రెండు సంవత్సరాలు ఖాళీగా లేరు. మరి అంతకంటే తక్కువ హీరోలతో కొరటాల చేసే ఛాన్స్ ఉండదు. దీన్ని బట్టి కొరటాలకి హీరోల కష్టాలు మొదలయినట్టే అని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది.
వరుస విజయాల్లో ఉన్న కొరటాల శివ కి చిరు(Chiranjeevi)చరణ్(Ram Charan)తో చేసిన 'ఆచార్య' భారీ డిజాస్టర్ గా నిలవడం పెద్ద మైనస్ గా నిలిచింది. దాంతో ఆ సమయంలో బడా హీరోలు ఎవరు కొరటాల శివ తో సినిమా చేయడానికి ఇష్టపడలేదనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో నడిచింది. ఆ సమయంలో కొరటాల శివ కి ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వడం, దేవర ఎన్టీఆర్ కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ గా నిలవడం తెలిసిందే.