English | Telugu

కలర్, ఎక్స్‌పోజింగ్ చెయ్యాలి.. అప్పుడే షో కి పిలుస్తాను 

తెలుగు 'బిగ్ బాస్ సీజన్ 6 'లో పాల్గొన్న ప్రముఖ నటి 'కీర్తి భట్'(Kirti Bhatt). ఈ షో ద్వారా ఎంతో మంది అభిమానులని సంపాదించుకొని దాదాపుగా 'విన్నర్' అయినంత పని చేసింది. కానీ ఫైనలిస్ట్‏గా నిలిచింది. బుల్లితెరపై 'మనసిచ్చిచూడు, కార్తీక దీపం, మధురానగరి వంటి సీరియల్స్ తో నటిగా తన సత్తా చాటిన కీర్తి మరిన్ని సీరియల్స్ ద్వారా ప్రేక్షకులని తన నటనతో మెస్మరైజ్ చేయనుంది.


రీసెంట్ గా కీర్తి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు బిగ్‌బాస్‌ సీజన్ 6(Big boss season 6) కంప్లీట్ అయ్యాక, నిర్వాహకులు BB అవార్డ్స్‌ అనే కార్యక్రమం చేశారు. ఫైనలిస్ట్ గా నిలిచినా నన్ను పిలవలేదు. అప్పుడు నాకు అర్ధమైంది ఏంటంటే, షోలకి వెళ్లాలంటే ఇష్టమొచ్చినట్టు మాట్లాడి కంటెంట్‌ క్రియేట్‌ చేయాలి. గ్లామరస్ గా ఉండటంతో పాటు, ఎక్స్ పోజింగ్ చేయాలి. మంచి రంగు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే షో లకి పిలుస్తారు. అవన్నీ చెయ్యడం నా వల్ల కాదని కీర్తి చెప్పుకొచ్చింది.

2017 లో జరిగిన ఒక కారు ప్రమాదంలో అమ్మ, నాన్న, అన్న, వదిన, అన్నపిల్లలు, ఇలా కుటుంబం మొత్తాన్ని కీర్తి పోగొట్టుకుంది. తను మాత్రం తీవ్రగాయాలతో, కొన్ని రోజుల పాటు కోమాలో ఉండి ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత ఎన్నో కష్టాలను ఎదుర్కొని, తన నటన ద్వారా అభిమానులని రంజింపచేస్తున్న కీర్తికి, 2023 లో కన్నడ నటుడు విజయ్ కార్తీక్ తో ఎంగేజ్మెంట్ జరగగా, 2017 లో 'ఐస్ మహల్' అనే చిత్రం ద్వారా కీర్తి నటనా వృత్తిలోకి ప్రవేశించింది.



అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.