English | Telugu
తొలి మహిళగా రికార్డు బద్దలు కొట్టిన శ్వేతా మీనన్.. అధ్యక్షురాలిగా ఎన్నిక
Updated : Aug 16, 2025
'రతి నిర్వేదం'(Rathinirvedam)ఫేమ్ 'శ్వేతా మీనన్'(Shwetha Menon)గురించి తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి లేదు. 1991లో 'మమ్ముట్టి'(mammootty)హీరోగా వచ్చిన 'అనశ్వరం' అనే చిత్రంతో, హీరోయిన్ గా మలయాళ సినీ రంగ ప్రవేశం చేసిన శ్వేతా, ఇప్పటి వరకు హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో సుమారు వంద సినిమాల వరకు చేసింది. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ ని సైతం అందుకుంది.
మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి అధ్యక్షుడుగా ఉన్న 'మోహన్ లాల్'(Mohan Lal)కొన్ని నెలల క్రితం తన పదవికి రాజీనామా చేసాడు. మలయాళ చిత్ర పరిశ్రమలో పని చేసున్న మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో మోహన్ లాల్ రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నాడు. దీంతో నిన్న మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా అధ్యక్ష పదవికి శ్వేతామీనన్ పోటీ చేసింది. ఈ మేరకు నిన్న ఫలితాలు వెలువడ్డాయి. శ్వేతా తన ప్రత్యర్థి దేవన్‌పై ఘన విజయాన్ని అందుకుంది. మూడు దశాాబ్దాల మలయాళ సినీ చరిత్రలో ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తొలి మహిళగా కూడా రికార్డుని క్రియేట్ చేసింది. మొత్తం 506 మంది సభ్యులు ఉండగా,298 మందే ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
వైస్ ప్రెసిడెంట్‌గా లక్ష్మీ ప్రియ, జాయింట్ సెక్రటరీగా కుక్కు పరమేశ్వరన్, జనరల్ సెక్రటరీగా అన్సిబా హాసన్ ఎన్నికయ్యారు. గతంలో అధ్యక్ష పదవిని మోహన్ లాల్ తో పాటు, మమ్ముట్టి, ఎంజీ సోమన్ వంటి అగ్రతారలు చేపట్టారు. కొన్ని రోజుల క్రితం శ్వేతా మీనన్ పై మార్టిన్ అనే వ్యక్తి కోర్టుని ఆశ్రయించాడు . శ్వేతా మీనన్ అడల్ట్ చిత్రాల్లో నటిస్తు యువతని తప్పుదోవ పట్టిస్తుంది. గతంలో ఆమె మీడియాతో మాట్లాడుతు, డబ్బుల కోసం ఎలాంటి సినిమాలైనా చేస్తానని చెప్పిందని మార్టిన్ కోర్ట్ లో పిటిషన్ వేసాడు. అలాంటి ఈ సమయంలో మలయాళ మూవీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి శ్వేతా మీనన్ అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.