English | Telugu

టాలీవుడ్ స్టార్స్ కి షాకిచ్చేలా 'కాంతార-2' తెలుగు బిజినెస్!

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కూడా హిట్ టాక్ వస్తేనే తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల షేర్ రాబడుతుంటాయి. అలాంటిది ఓ డబ్బింగ్ సినిమాకి తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం వంద కోట్లు కోట్ చేస్తున్నారు మేకర్స్. ఆ సినిమా ఏదో కాదు.. కాంతార చాప్టర్-1.

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కాంతార'. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీ 2022లో సైలెంట్ గా వచ్చి ఏకంగా రూ.400 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.30 కోట్ల షేర్ తో ఘన విజయం సాధించింది.

ఇప్పుడు కాంతారకి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్-1 రూపొందుతోంది. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దానిని దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు తెలుగు రాష్ట్రాల రైట్స్ ని ఏకంగా వంద కోట్లకు కోట్ చేస్తున్నట్లు సమాచారం.

గతంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన 'కేజీఎఫ్-2' కూడా తెలుగునాట రూ.75 కోట్ల బిజినెస్ చేస్తే అందరూ ఆశ్చర్యపోయారు. సీక్వెల్ హైప్ తో వచ్చిన ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లతో సత్తా చాటి.. తెలుగు రాష్ట్రాల్లో లాభాలు చూసింది.

ఇప్పుడు 'కాంతార చాప్టర్-1'కి ప్రీక్వెల్ హైప్ తో పాటు, డివోషనల్ టచ్ కూడా ఉండటంతో.. నైజాం రూ.40 కోట్లు, ఆంధ్రా రూ.45 కోట్లు, సీడెడ్ రూ.15 కోట్లు చొప్పున మొత్తం వంద కోట్లు కోట్ చేస్తున్నారట. 90 కోట్లకు అటుఇటుగా డీల్ క్లోజ్ అయ్యే అవకాశముంది అంటున్నారు. అదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ సినిమాల బిజినెస్ పరంగా సరికొత్త రికార్డు సృష్టించిన సినిమాగా 'కాంతార చాప్టర్-1' నిలుస్తుంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.