English | Telugu

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో బాలకృష్ణ పేరు!

కొన్నేళ్లుగా నటసింహం నందమూరి బాలకృష్ణ టైం నడుస్తోంది. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. కథానాయకుడిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఏకైక వ్యక్తిగా అరుదైన ఘనత సాధించిన బాలకృష్ణ.. ఇప్పటికీ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. రాజకీయాల్లోనూ అంతే. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఇలా అరుదైన ఘనతలతో దూసుకుపోతున్న బాలయ్య.. పలు అరుదైన గౌరవాలనూ ఖాతాలో వేసుకుంటున్నారు.

సినిమా మరియు సమాజానికి చేసిన సేవలకు గాను భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ భూషణ్‌తో ఇటీవల బాలకృష్ణ సత్కరించబడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి 'ఎన్టీఆర్ నేషనల్ అవార్డు' అందుకున్నారు. అంతేకాకుండా, ఆయన నటించిన 'భగవంత్ కేసరి' చిత్రం ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును గెలుచుకుంది. తాజాగా బాలకృష్ణ మరో ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు.

భారతీయ సినిమాలో హీరోగా బాలకృష్ణ చేసిన విశేష కృషికి గుర్తింపుగా, UK లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో బాలకృష్ణను చేర్చి సత్కరిస్తున్నారు. ఈ సత్కారం ఆగస్టు 30న హైదరాబాద్‌లో జరగనుంది.

ఐదు దశాబ్దాలుగా సినీ రంగానికి సేవ చేస్తూ, లక్షలాది మందికి ప్రేరణగా నిలిచిన బాలకృష్ణను గౌరవించుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ సంతోష్ శుక్లా అన్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.