English | Telugu
అప్పుడే ఓటీటీలోకి కన్నప్ప..!
Updated : Jul 22, 2025
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిన చిత్రం 'కన్నప్ప'. మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించారు. మంచి అంచనాలతో జూలై 27న థియేటర్లలో అడుగుపెట్టిన కన్నప్ప.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ నుసొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది. (Kannappa OTT)
'కన్నప్ప' స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. జూలై 25 నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అంటే థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలోకి అడుగుపెడుతోంది అన్నమాట.
ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ లో రూపొందిన కన్నప్ప చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకుడు. స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్, ఆర్. శరత్‌కుమార్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.