English | Telugu
యన్ టి ఆర్ పెళ్ళి సెట్ ఖర్చు 18 కోట్లు
Updated : Apr 19, 2011
ఈ వివాహాన్ని కనీ వినీ ఎరుగని రీతిలో ఘనంగా జరగాలని అన్ని విషయాలనూ చాలా పకడ్బందీగా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేస్తున్నారు. ఈ వివాహ వేదికను నిర్మించటానికి అయ్యే ఖర్చు పద్ధెనిది కోట్ల రూపాయలని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. అంటే ఆ వేదికపైకి వధూ వరులను ఆశీర్వదించటానికి వచ్చే సినీ, రాజకీయ ప్రముఖులందరు రావటానికి పోవటానికి కూడా చాలా అనుకూలంగా, చాలా సౌకర్యవంతంగా ఉండేలా చాలా రిచ్ గా, విశాలంగా ఈ వేదిక ఉండబోతోందట.
ఇక ఈ యన్ టి ఆర్ పెళ్ళికి ఆహ్వానించే కార్డు ఖరీదు మూడువేల రూపాయలని తెలిసింది. ఇక ఈ పెళ్ళిలో వడ్డించే భోజనం వివరాలు వింటే ఆశ్చర్యపోతారు. చక్కని తెలుగు సాంప్రదాయ భోజనంతో పాటు ఊహించనన్ని దేశవిదేశాలకు చెందిన స్వీట్లు, హాట్లు, పళ్ళు కూడా ఆహూతులను అలరించనున్నాయి. వివాహం అచ్చ తెనుగు ఆచారవ్యవహారాలతో, చక్కని తెనుగు సాంప్రదాయబద్ధంగా సశాస్త్రీయంగా జరుగనుందనీ సమాచారం.