English | Telugu

ఏప్రెల్30 కి అలా మొదలైంది వంద రోజులు

ఏప్రెల్ 30 న "అలా మొదలైంది" చిత్రం వంద రోజులు పూర్తి చేసుకోబోతోంది. వివరాల్లోకి వెళితే శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై, యువ హీరో నాని హీరోగా, నిత్య మీనన్ హీరోయిన్ గా, నందినీ రెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ, కె.యల్.దామోదర ప్రసాద్ నిర్మించిన విభిన్న ప్రేమకథా చిత్రం " అలా మొదలైంది". ఈ "అలా మొదలైంది" చిత్రం చిన్న చిత్రంగా మొదలై ఇంతింతై వటుడింతై అన్న చందంగా ప్రస్తుతం అతి త్వరలో అంటే ఏప్రెల్ ౩0 న వంద రోజులు పూర్తిచేసుకోబోతూంది.

ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల్ వ్రాసిన చక్కని అర్థవంతమైన మాటలు, కళ్యాణి మాలిక్ వీనుల విందైన సంగీతం, నాని, నిత్య మీనన్ ల ముచ్చటైన నటన, నందినీ రెడ్డి కథ, స్క్రీన్ ప్లే, దర్స్వ్హకత్వం ఈ చిత్రాన్ని విజయపథంలో నడిపించాయని చెప్పవచ్చు. మా సినిమాకి నలభై కోట్లు ఖర్చుచేశాం చాలా రిచ్ గా తీశాం, పెద్ద పెద్ద సెట్లలో పాటలు చిత్రీకరించాం అని చెప్పుకునే సో కాల్డ్ మెగా నిర్మాతలకంటే చిన్న సినిమాని లిమిటెడ్ బడ్జెట్ తో నిర్మించి ఘనవిజయం సాధించిన కె.యల్.దామోదర ప్రసాద్ నిజానికి మెగా నిర్మాతని చెప్పాలి.

ఇక్కడ బడ్జెట్ ఎంత ఎక్కువ ఖర్చు చేశామన్నది ముఖ్యం కాదు. చిన్న బడ్జెట్ సినిమా అయినా విజయం సాధించిందా లేదా అన్నదే ముఖ్యమని నిర్మాతలంతా గుర్తుంచుకుంటే మన తెలుగు సినీ పరిశ్రమ పది కాలాలు పచ్చగా ఉంటుంది. ఈ సందర్భంగా "అలా మోదలైంది" చిత్రం ఘనవిజయం సాధించి వంద రోజులు పూర్తి చేసుకుంటున్న సమదర్భంగా ఈ చిత్రం యూనిట్ కు తెలుగువన్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.