English | Telugu

రికార్డు ఓటీటీ డీల్ తో సంచలనం సృష్టిస్తున్న డ్రాగన్!

ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ పడిపోయిందని, పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకు కూడా ఓటీటీ సంస్థల నుంచి బిగ్ డీల్స్ రావడం లేదని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) అప్ కమింగ్ మూవీ ఓటీటీ డీల్ హాట్ టాపిక్ గా మారింది.

ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు. 'డ్రాగన్'(Dragon) అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20న టైటిల్ ని అధికారికంగా ప్రకటించడంతో పాటు.. ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ అయ్యే అవకాశముంది. (NTR Neel)

ఇంతవరకు అధికారికంగా టైటిల్ ప్రకటించలేదు. ఫస్ట్ లుక్ విడుదల కాలేదు. కొత్త విడుదల తేదీపై ఇంకా క్లారిటీ రాలేదు. అయినప్పటికీ 'డ్రాగన్' ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.155 కోట్లకు నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం.

'డ్రాగన్'ను రెండు భాగాలుగా విడుదల చేయాలని చూస్తున్నారు. కేవలం మొదటి భాగానికే రూ.155 కోట్లు చెల్లించడానికి నెట్ ఫ్లిక్స్ ఓకే చెప్పినట్లు వినికిడి. ఈ మధ్య కాలంలో ఓటీటీ డీల్ పరంగా ఇదొక రికార్డుగా చెప్పవచ్చు.

Also Read: బాలకృష్ణ, హరీష్ శంకర్ కాంబో మూవీ.. పూర్తి డీటెయిల్స్ ఇవే!

కమల్ హాసన్ పై కస్తూరి కీలక వ్యాఖ్యలు.. మధ్యలో తెలుగోళ్లు వచ్చారు 

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్(Kamal Haasan)..సీనియర్ నటి కస్తూరి(kasturi).. తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన ఈ ఇద్దరు సుదీర్ఘ కాలం నుంచే తెలుగు సినిమాల్లో తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ముఖ్యంగా కమల్ సినీ గ్రాఫ్ గురించి చెప్పుకోవాలంటే రోజులు చాలవు. ఇక ఆ ఇద్దరు భారతీయుడు లో అన్నా చెల్లెళ్లుగా, తండ్రి కూతుళ్లుగా చేసి అభిమానులని తమ పెర్ ఫార్మెన్స్ తో అలరించారు. కానీ ఇప్పుడు రాజకీయంగా ప్రత్యర్థులు. ఈ విషయాన్నీ గుర్తు చేస్తు కమల్ హాసన్ పై కస్తూరి చేసిన తాజా వ్యాఖ్యలు సినీ, పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.