English | Telugu

ఎన్టీఆర్ హ్యాండిచ్చాడు.. చరణ్ పైనే ఆశలన్నీ..!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించినప్పటికీ జాన్వీకి పెద్దగా క్రెడిట్ రాలేదు. ఎందుకంటే ఆమె రోల్ కేవలం సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. దానికితోడు రెండు పాటలు, కొన్ని సీన్లకే జాన్వీ పాత్ర పరిమితమైంది. అయితే సినిమా విడుదల సమయంలోనే తన రోల్ పార్ట్-1లో కంటే పార్ట్-2లో ఎక్కువ ఉంటుందని జాన్వీ చెప్పుకొచ్చింది. ఆమె మాటలను బట్టి చూస్తే.. 'దేవర-2'పై ఎన్నో ఆశలు పెట్టుకుందని అర్థమైంది. అయితే ఇప్పుడసలు దేవర-2 ఉంటుందా లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

'దేవర-2' చేయకూడదనే ఆలోచనలో ఎన్టీఆర్, కొరటాల శివ ఉన్నారని తాజాగా ప్రచారం జరుగుతోంది. కొరటాల తన తదుపరి చిత్రాన్ని నాగ చైతన్యతో చేసే సన్నాహాల్లో ఉన్నాడని తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్, నెల్సన్ ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయి. ఈ లెక్కన దేవర-2 ఉండకపోవచ్చనే మాట ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే ఇక జాన్వీ హోప్స్ అన్నీ 'పెద్ది' పైనే ఉంటాయి.

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న 'పెద్ది' సినిమాలో జాన్వీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. 'పెద్ది' జాన్వీకి రెండవ తెలుగు సినిమా. ఇది హిట్ అయితే తెలుగులో స్టార్ హీరోల సినిమాలు ఆమెకు క్యూ కట్టే అవకాశముంది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...