English | Telugu

ప్రభాస్ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందా..?

ఇటీవల 'కల్కి 2898 AD'తో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో.. 'రాజా సాబ్', 'ఫౌజీ', 'కల్కి 2', 'సలార్ 2', 'స్పిరిట్' ఇలా పలు భారీ సినిమాలు ఉన్నాయి. వీటిలో 'రాజా సాబ్', 'ఫౌజీ' చిత్రాలను ప్రభాస్ ముందు పూర్తి చేస్తాడని అంటున్నారు. ఈ రెండు పూర్తయ్యాక మిగతా సినిమాలపై దృష్టి పెట్టే అవకాశముందట. ఇదిలా ఉంటే వీటితో పాటు మరో భారీ ప్రాజెక్ట్ లో కూడా ప్రభాస్ నటించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'రావణం' అనే మైథలాజికల్ ఫిక్షనల్ మూవీని గతేడాది ప్రారంభంలో దిల్ రాజు ప్రకటించారు. ఏడాది దాటిపోయినా ఇంతవరకు ఆ సినిమాకి సంబంధించిన ఊసే లేదు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇప్పటికే 'సలార్' వచ్చింది. 'సలార్ 2' కూడా ప్రకటించారు.. కానీ, అది ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో తెలీదు. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. దానికి తోడు ప్రశాంత్ నీల్ తన తదుపరి చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్నారు. ఇది కూడా రెండు భాగాలుగా రానుందని టాక్. ఇది చాలదు అన్నట్టు.. అజిత్, రామ్ చరణ్ వంటి హీరోలతో ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీస్ ఉంటాయని అంటున్నారు. అటు ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు, ఇటు ప్రశాంత్ నీల్ కమిట్ మెంట్స్ పూర్తయి.. 'సలార్ 2' నే ఎప్పుడు మొదలవుతుందో అనే సస్పెన్స్ నెలకొంది. ఈ లెక్కన అసలు 'రావణం' ప్రాజెక్ట్ ని పూర్తిగా మర్చిపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'రావణం' సినిమా దాదాపు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా అది మొదలు కావడానికే కొన్నేళ్లు పట్టే అవకాశముంది. అందుకే కొంతకాలంగా దిల్ రాజు సైతం ఈ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి చప్పుడు చెయ్యట్లేదు.

'రావణం'తో పాటు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంతో 'జటాయు', శైలేష్ కొలను డైరెక్షన్ లో 'విశ్వంభర' సినిమాలు చేయనున్నట్లు కూడా గతేడాది దిల్ రాజు ప్రకటించారు. 'రావణం' మాదిరిగానే ఆ రెండు సినిమాల గురించి కూడా ఎటువంటి అప్డేట్ లేదు. పైగా 'విశ్వంభర' టైటిల్ తో చిరంజీవి ఓ సినిమా చేస్తున్నారు. మరి దిల్ రాజు ఎంతో గర్వంగా ప్రకటించిన ఈ మూడు సినిమాలు ఆగిపోయాయో లేక భవిష్యత్ లో ఉంటాయో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.