English | Telugu

దిగొచ్చిన బిత్తిరి సత్తి.. భగవద్గీతను ఆరాధిస్తాడట.. కానీ..?

భగవద్గీతను అనుకరిస్తూ రవికుమార్ అలియాస్ బిత్తిరి సత్తి (Bithiri Sathi) చేసిన కామెడీ వీడియోపై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. హిందూ సంఘాలు సత్తిపై మండిపడ్డాయి. రాష్ట్రీయ వానరసేన ఆయనపై కేసు కూడా నమోదు చేసింది. అంతేకాదు, రాష్ట్రీయ వానరసేనకు చెందిన ఒక సభ్యుడు బిత్తిరి సత్తికి ఫోన్ చేసి ఈ విషయంపై వివరణ కోరగా.. నేను హిందువునే, నేను ఏ తప్పు చేయలేదు అంటూ ఘాటుగా స్పందించాడు. ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. బిత్తిరి సత్తిపై మరింత వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు పెరిగాయి. ఈ ఊహించని వ్యతిరేకతతో సత్తి దిగొచ్చాడు. క్షమాపణలు చెబుతూ తాజాగా ఒక వీడియోని విడుదల చేశారు.

"మనోళ్లకు సారీ" అంటూ తాజాగా బిత్తిరి సత్తి ఓ వీడియో రిలీజ్ చేశాడు. "ఈమధ్య ఒక వీడియో వైరల్ చేస్తున్నారు. అందులో వాస్తవం లేదు. నేను ఎప్పటినుంచో కామెడీ వీడియోస్ చేస్తున్నా. ఆ వీడియోలో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. భగవద్గీతను నేనూ ఆరాధిస్తా. పారాయణం చేస్తుంటా. ప్రచారం చేస్తుంటా. నా అభిమానులు, శ్రేయోభిలాషులు, నన్ను ఇష్టపడేవాళ్లు, బంధుమిత్రులు.. నిజంగా వాళ్లకి కించపరిచినట్లు అనిపిస్తే.. తప్పకుండ క్షమించమని అడుగుతున్నా. అయితే నాకు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా వీడియోలను చేసేవాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఎదుర్కొంటాను." అని బిత్తిరి సత్తి చెప్పుకొచ్చాడు. అయితే ఆయన చెప్పిన సారీ మొక్కుబడిగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.