English | Telugu

హనుమాన్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..సరికొత్త రికార్డు కి దగ్గరలో 

జనవరి 12 నుంచి టోటల్ ఇండియా మొత్తం హనుమాన్ (hanuman) మూవీ నామస్మరణతో ఊగిపోతోంది. పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలైన హనుమాన్ ఆల్ ఏరియాస్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది. అసలు ఏ ముహూర్తాన హనుమాన్ టీం కి ఆ అంజనాసుతుడు నామాన్ని తమ చిత్రానికి పెట్టాలని అనుకున్నారో గాని ఆ హనుమంతుడు ఎంత ఎంత బలవంతుడో అంతే బలంగా హనుమాన్ మూవీ రికార్డు స్థాయి కలెక్షన్స్ ని సాధిస్తుంది. పైగా తెలుగు సినిమా చరిత్రలో ఒక నయా శకాన్ని సృష్టించడానికి కూడా హనుమాన్ రెడీ అవుతుంది.

హనుమాన్ తొలి వారం 150 కోట్ల గ్రాస్ ని సాధించింది. అంటే సుమారు 80 కోట్ల షేర్ వరకు సాధించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారకంగా కూడా ప్రకటించింది. ఎలాంటి పెద్ద హీరోగాని పెద్ద డైరెక్టర్ గాని ప్రొడ్యూసర్ గాని లేకుండా బడా హీరోల సినిమాల మధ్య రిలీజైన హనుమాన్ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ (prashanth varma) హనుమాన్ ని నడిపిన విధానానికి అందరు మంత్ర ముగ్ధులయ్యారు. అలాగే మూవీలో నటించిన తేజ సజ్జ,వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు మిగతా ఆర్టిస్ట్స్ లు కూడా అధ్బుతంగా నటించారు. 24 క్రాఫ్ట్స్ కూడా ప్రాణం పెట్టి పని చేసారు. గ్రాఫిక్ వర్క్ హనుమాన్ విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఇకపోతే తాజాగా హనుమాన్ కి చాలా ఏరియాల్లో థియేటర్స్ పెరగడం వలన కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా తెలుగు చలన చిత్ర చరిత్రలో టాప్ కలెక్షన్స్ ని సాధించిన మొదటి ఐదు సినిమాల్లో హనుమాన్ ఒకటిగా నిలిచినా కూడా పెద్దగా ఆశ్చర్య పడాల్సిన పని లేదు .ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో హనుమాన్ టికెట్స్ దొరకడంలేదు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.