English | Telugu

‘భోళా శంకర్’ పై ఆదిరెడ్డి రివ్యూ ... నచ్చలేదు బ్రదర్!

ఆదిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ 6 లో కామన్ మాన్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చి మిగతా హౌస్ లోని కంటెస్టెంట్స్ కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 నుంచి యూట్యూబ్‌లో రివ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. మొదట్లో అతనెవరో ఎవరికీ తెలీదు. బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చాక సోషల్ మీడియాలో ఇతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఆది రెడ్డి యూట్యూబ్‌లో 3 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆది రెడ్డి ఓ సామాన్య కుటుంబం నుంచి బిగ్ బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు చిన్న సైజు సెలెబ్రెటీగా మారిపోయాడు. ఆడియన్స్ అందరిని తన డాన్స్ తో బాగా అలరించేవాడు .అలా అది రెడ్డి కి ఫాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అతను కొత్త సినిమాలకి రివ్యూస్ ఇస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన "భోళా శంకర్" మూవీకి కూడా రివ్యూ ఇచ్చాడు. ఈ సినిమా అస్సలు బాలేదంటూ ఆదిరెడ్డి రివ్యూ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఇంతకీ ‘భోళా శంకర్’ మూవీ చూసాక ఆదిరెడ్డి ఏమన్నాడంటే.. ‘భోళా శంకర్ మూవీ నాకు నచ్చలేదు. సినిమా బాలేకపోవడానికి కారణం చిరంజీవిగారు కాదు. మెహర్ రమేష్ డైరెక్షనే. మెగాస్టార్ రేంజ్‌కి తగ్గట్టుగా సీన్లు లేవు. కామెడీ కూడా బాలేదు. ఈ సినిమాలో ప్లస్‌లు ఏవైనా ఉన్నాయా అంటే.. అది చిరంజీవి గారే. ఆయన ఫైట్లు, ఆయన డాన్స్, ఆయన యాక్టింగ్.. ఇవి తప్ప మిగిలినవన్నీ మైనస్‌లే. సాంగ్స్ కూడా ఓకే ఓకే అన్నట్టుగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగోలేదు. భోళా శంకర్ చూసిన తరువాత నాకు జెన్యూన్‌గా అనిపించింది ఇదే’ అంటూ రివ్యూ చెప్పేశాడు ఆదిరెడ్డి. సినిమా బాలేదని ఆదిరెడ్డి చెప్పడంతో ఫ్యాన్స్ హర్ట్ అయిపోతున్నారు. చాల రోజుల తర్వాత మెహర్ రమేష్ ఇండస్ట్రీలో చిరుతో కలిసి చేసిన మూవీ ఇది. ఐతే మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా చిరు మూవీ వస్తోందంటే చాలు ఫాన్స్ కి పండగే..ఎలా ఐనా హిట్ చేసేస్తారు. కానీ ఇప్పుడు ఆదిరెడ్డి రివ్యూ పై ఫుల్ ఫైర్ అవుతున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.