English | Telugu

అంజలి హాఫ్‌ సెంచరీ.. గీతాంజ‌లి మళ్ళీ వ‌చ్చింది!

ప్రముఖ నటి అంజలి టైటిల్ రోల్ పోషించిన హారర్ కామెడీ చిత్రం 'గీతాంజ‌లి', 2014 ఆగస్టులో విడుదలై మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. ప్రతీకార జ్వాల‌తో మళ్ళీ వ‌చ్చేస్తోంది గీతాంజ‌లి అంటూ తాజాగా 'గీతాంజ‌లి' సీక్వెల్ ని ప్రకటించారు మేక‌ర్స్.

'గీతాంజ‌లి మళ్ళీ వ‌చ్చింది' అనే టైటిల్ తో ఈ సీక్వెల్ ను తెర‌కెక్కిస్తున్నారు. వెన్నులో వ‌ణుకు పుట్టించే ప్రాజెక్ట్ అంటూ థ్రిల్లింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు మేక‌ర్స్. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన గీతాంజ‌లి సీక్వెల్ షూటింగ్ ఈరోజు(సెప్టెంబర్ 23) నుంచే మొద‌లైంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఓ పాడుబ‌డ్డ బంగ్లా ప్రాంగ‌ణంలో అటుగా తిరిగి కూర్చుని ఉన్న అమ్మాయి పోస్ట‌ర్ సినిమాపై ఆస‌క్తి కలిగిస్తోంది.

ఇది అంజ‌లి న‌టిస్తున్న 50వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి శివ తుర్ల‌పాటి దర్శకుడు. కోన వెంక‌ట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ బ్యానర్స్ పై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ నిర్మిస్తున్నారు.

'గీతాంజ‌లి మళ్ళీ వ‌చ్చింది' చిత్రంలో అంజ‌లి, శ్రీనివాస‌రెడ్డి, స‌త్యం రాజేష్‌, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, అలీ, బ్ర‌హ్మాజీ, ర‌వి శంక‌ర్, రాహుల్ మాధ‌వ్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. కోన వెంక‌ట్‌ కథ అందిసున్న ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, సినిమాటోగ్రాఫర్ గా సుజాత సిద్ధార్థ్, ఎడిటర్ గా చోటా కె ప్ర‌సాద్‌ వ్యవహరిస్తున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.