English | Telugu

‘దూత’ వెబ్ సిరీస్ రివ్యూ


వెబ్ సిరీస్: దూత
నటీనటులు : నాగచైతన్య, పార్వతీ తిరువోతు, ప్రియా ‌భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, పశుపతి, తరుణ్ భాస్కర్, రవీంద్ర విజయ్, రోహిణి, తనికెళ్ళ భరణి తదితరులు
ఎడిటింగ్: నవీన్ నూలి
డైలాగ్స్: వెంకట్ . డి
సినిమాటోగ్రఫీ: మికోలజ్ సైగుల
మ్యూజిక్: ఇషాన్ చభ్రా
నిర్మాతలు: శరత్ మరార్, విక్రమ్ కె. కుమార్
దర్శకత్వం: విక్రమ్ కె.‌ కుమార్
ఓటిటి: అమెజాన్ ప్రైమ్ వీడియో

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి, వెబ్ సిరీస్ లకి గిరాకి ఎక్కువే. సినిమా లవర్స్ కి ఈ జానర్ కథలంటే ఎంతో మక్కువ. అలాంటి కథతో నాగ చైతన్య తీసిన వెబ్ సిరీస్ ' దూత'. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ కథేంటో ఒకసారి చూసేద్దాం..


కథ:

ప్రముఖ జర్నలిస్ట్ సాగర్ వర్మ అవధూరి(నాగచైతన్య) అతని భార్య ప్రియ, పాప అంజిలితో కలిసి విశాఖపట్నంలోని బీచ్ రోడ్ లో రాత్రి ఒక ఫంక్షన్ కి బయల్దేరి వెళ్తుంటారు. కొద్దిదూరం వెళ్ళాక ధమ్ ధమ్ దాబా దగ్గర కార్ ఆగిపోతుంది. ఫ్యయల్ అయిపోయి కార్ ఆగిపోతుంది. ఇక తన ఫ్రెండ్ అమృతకి కాల్ చేసి కార్ ని పంపించమంటాడు సాగర్ వర్మ. అక్కడే దాబాలోకి వెళ్ళి తినడానికి ఆర్డర్ ఇచ్చి కూర్చుంటాడు. అక్కడ ఒక బల్బుకి ఒక సినిమా పజిల్ సుడోకు కాగితం ముక్క కనపడుతుంది. అది చూసి చదువుతుంటాడు సాగర్ వర్మ. ఆ పేపర్ లో మూడవ వరుస ఖాళీ ఉండటంతో అది ఫిల్ చేద్దామని క్లూ చదువుతుంటాడు సాగర్ వర్మ. అదే రోజు రాత్రి పదకొండు గంటల నలభై అయిదు నిమిషాల ముప్పై సెకండ్లకు కార్ యాక్సిడెంట్ లో చనిపోయిన కుక్కు పేరేంటి అని ఉండటంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. సరిగ్గా అదే సమయానికి ఒక ట్రక్ వచ్చి కార్ ని గుద్దేయడంతో కారులో ఉన్న కుక్క చనిపోతుంది. ఇదేంటి జరుగబోయేది ముందే తెలియడమేంటని సాగర్ వర్మకు అర్థం కాదు. కాసేపటికి సాగర్ వర్మ స్నేహితుడు గన్ ఫైర్ చేసుకొని తనముందే చనిపోతూ.. ఇది ఆగదు అంటూ చెప్తాడు. దాంతో అసలేం జరుగుతుందో సాగర్ వర్మకి అర్థం కాదు. అయితే ఇలా సాగర్ వర్మకి సంబంధించిన ఒక్కొక్కరు చనిపోతుంటారు. అసలు వారెలా చనిపోతున్నారు? జర్నలిస్ట్ సాగర్ వర్మ తన ఫ్యామిలీని కాపాడుకున్నాడా? దూత, సాగర్ ల మధ్య సంబంధమేంటి? తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:

అర్థరాత్రి దాబా దగ్గర తనకి జరుగబోయేది ముందే పేపర్ లో రావడంతో ఒక థ్రిల్ ని ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు. ఆ తర్వాత వచ్చే క్లూ సిరీస్ పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి.

సాగర్ వర్మ, అతని భార్య ప్రియ ఇద్దరు జర్నలిస్టులే అవడంతో ఇద్దరికి సమస్యలు ఎదురవుతాయి. అయితే అసలు జర్నలిస్టులకి దూతకి సంబంధమేంటి? వాటిని కనుక్కోవడానికి సాగర్ వర్మ ఏం చేశాడో చెప్తూ ప్రతీ ఎపిసోడ్ ని ఇంటెన్స్ తో రన్ చేయడంలో డైరెక్టర్ విజయం సాధించాడు.

1962 లో స్వాతంత్ర్యం తర్వాత నిజాలని మాత్రమే తెలియజెప్పాలని కొన్ని పత్రికలు ఒక సీక్రెట్ సమాచారాన్ని చేరవేసాయని, వాటికోసం కొన్ని అక్షరాలని అలా రాసేవారంటూ చెప్పే సీన్స్, ఆ కాలంలో మాటకి, పత్రికలలో మద్రించే అక్షరాలకి విలువలున్నాయంటూ , వాటిని కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం అవినీతికి పాల్పడ్డారని కళ్ళకి కట్టినట్టు చూపించారు. అయితే సాగర్ వర్మ ప్రస్తుతం మోస్ట్ క్రిమినల్ ‌అండ్ రూత్ లెస్ కరప్టెడ్ ఎడిటర్ అని అందరికి తెలిసిపోతుంది. దీంతో సాగర్ వర్మకి పరోక్షంగా క్లూ ఇస్తుంటాడు దూత. అసలు ఈ దూతకి జర్నలిస్టులకి సంబంధమేంటని చక్కగా తీర్చిదిద్దారు మేకర్స్. సాగర్ వర్మ చేసిన రీసెర్చ్, స్పెషల్ ఆఫీసర్ క్రాంతి చేసిన ఇన్వెస్టిగేషన్ మోస్ట్ థ్రిల్ ని ఇస్తాయి. ఈ వెబ్ సిరీస్ నిడివి కాస్త ఎక్కువ ఉన్నా కానీ ఫుల్ ఎంగేజింగ్ గా సాగుతుంది. ఎక్కడా అడల్ట్ సీన్స్ లేవు. కానీ ఒకటి రెండు చోట్ల బ్లడ్ కనిపిస్తుంది.

సాగర్ వర్మ ఒక పెద్ద పత్రికలో ఛీఫ్ ఎడిటర్ గా చేస్తున్నాడు కాబట్టి 'ఎఫ్' అంటూ బూతులు మాట్లాడటం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే మధ్యలో ఒకటి రెండు చోట్ల ఇదే వర్డ్ రిపీట్ అవుతున్నా, అది సీన్ కి సరైనదిగా అనిపిస్తుంది. ప్రతీ ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుడిని థ్రిల్ కి గురిచేస్తాయి. ఎక్కడ కూడా బోరింగ్ అనిపించకుండా, చివరి దాకా ఆ ఇంటెన్స్ ని క్రియేట్ చేసాడు డైరెక్టర్. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ సరిపోయింది. బిజిఎమ్ సీన్స్ ని ఎలవేట్ చేసేదిలా బాగుంది. రచన ఆకట్టుకుంది. ‌నిజాలు, విలువలు అంటు సాగే కథనానికి సరిపోయే డైలాగ్స్ ఇచ్చారు మేకర్స్. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

సాగర్ వర్మ అవధూరిగా నాగచైతన్యని తప్ప మరెవరిని ఆ పాత్రలో ఊహించుకోలేం.. అంతలా ఆ క్యారెక్టర్ కి ప్రాణం పెట్టి చేశాడు నాగ చైతన్య. స్పెషల్ ఆపీసర్ గా క్రాంతి ఆకట్టుకుంది. ఇక మిగిలిన పాత్రలు వారి పరిధి మేర నటించి మెప్పించారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:

పేపర్ ద్వారా గానీ, డిజిటల్ మీడియా ద్వారా గానీ నిజాలని దాచేయకూడదని, డబ్బులకి ఆశపడి అబద్ధాలని ప్రచురించకూడదంటూ ఇచ్చిన మెసెజ్.. ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేస్తుంది.

రేటింగ్: 3.25 / 5

✍🏻. దాసరి మల్లేశ్

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.