English | Telugu

డిసెంబర్  8 న సినీ ప్రేమికులకి పండగ 

2021లో ఓటీటీలో విడుదలైన మా ఊరి పొలిమేర కి సీక్వెల్ గా గత నెల ప్రారంభంలో థియేటర్స్ లో కి అడుగుపెట్టి మంచి విజయం సాధించిన మూవీ మా ఊరి పొలిమేర 2 . ఉరఫ్ పొలిమేర 2 .పెద్ద సినిమాలని సైతం తట్టుకొని మంచి కల్లెక్షన్లని రాబట్టిన ఈ మూవీ కి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి సినీ అభిమానుల్లో జోష్ ని తీసుకొచ్చింది. మరిన్ని ఎన్నో సినిమాలకి ఇన్స్పిరేషన్ గా కూడా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ ఇంకో సరికొత్త రూపాన్ని సంతరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సత్యం రాజేష్ ,బాలాదిత్య ,సాహితి దాసరి లు ప్రధాన పాత్రల్లో వచ్చిన పొలిమేర 2 ఇప్పుడు ఆహా వేదికగా డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. పొలిమేర 1 లో కొమరయ్య తమ్ముడైన జంగయ్యకి తన అన్న కొమ్మరయ్య నిజంగానే చేతబడులు చేస్తాడని తెలియడంతో పాటుగా చేతబడి చేసి చంపాడని అనుకుంటున్న కవిత తన అన్న కలిసి వేరే రాష్ట్రానికి పారిపోయారని కూడా జంగయ్యకి తెలిసినట్టుగా చూపించారు. ఇప్పుడు పార్ట్ 2 లో జంగమయ్య తన అన్న కొమరయ్యని పట్టుకున్నాడా? అసలు కొమరయ్య కవితలు దేని కోసం ఆ నాటకం ఆడారు అనే ప్రశ్నలకి క్లారిఫై ఇచ్చారు .

శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకంపై అనిల్ విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ పొలిమేర 2 కి గ్యాని సంగీతాన్ని అందించగా ఖుషేందర్‌ రమేష్‌ రెడ్డి కెమెరా బాధ్యతలని నిర్వర్తించాడు. సినిమా ఆసాంతం ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి సస్పెన్సు ని కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోను మా ఊరి పొలిమేర 2 ని మిస్ అవ్వకుండా చూడండి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.