English | Telugu

దేవర సెకండ్ సింగిల్.. ఎన్టీఆర్, జాన్వీ కెమిస్ట్రీ అదిరింది!

'దేవర' (Devara) నుంచి ఫస్ట్ సింగిల్ గా విడుదలైన 'ఫియర్ సాంగ్' (Fear Song) బిగ్ హిట్ అయింది. ఈ సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తోందని చెప్పవచ్చు. దీంతో 'దేవర' సెకండ్ సింగిల్ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా దేవర రెండో సాంగ్ అప్డేట్ వచ్చింది. (Devara Second Single)

జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర'. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్, అనిరుధ్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఆడియోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే 'ఫియర్ సాంగ్' అదిరిపోయింది. ఇక ఇప్పుడు సెకండ్ సాంగ్ విడుదలకి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 5న ఈ సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ ఒక పోస్టర్ ని వదిలారు. ఎన్టీఆర్, జాన్వీల రొమాంటిక్ పోస్టర్ అదిరిపోయింది. పోస్టర్ చూస్తుంటేనే ఈ జోడి.. స్క్రీన్ మీద మ్యాజిక్ చేస్తుంది అనిపిస్తుంది.