English | Telugu

'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్!

'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన సినిమా 'దేవర' (Devara). ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో ఫిల్మ్ కావడంతో 'దేవర'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఓవర్సీస్ బుకింగ్స్ కి ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో.. అంచనాలు మరింత పెరిగాయి. 'దేవర'గా ఎన్టీఆర్ ను బిగ్ స్క్రీన్ మీద చూడటానికి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసే న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కర్నూల్ లో ప్లాన్ చేస్తున్నారట. (Devara pre release event)

సీడెడ్(రాయలసీమ)లో ఎన్టీఆర్ కి ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే.. సీడెడ్ థియేటర్ల దగ్గర మాములు హంగామా ఉండదు. జాతరను తలపిస్తుంది. అలాంటివి ఇప్పుడు సీడెడ్ లో 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే.. ఏ స్థాయి హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఖమ్మంలో నిర్వహించాలని మొదట మేకర్స్ ప్లాన్ చేశారట. అయితే ఇటీవల ఖమ్మంను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ బాధ నుంచి వరద బాధితులు బయటకు రాలేదు. అందుకే ఇలాంటి సమయంలో సినిమా వేడుక చేయడం కరెక్ట్ కాదని భావించి.. మేకర్స్ కర్నూల్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 21న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని, ఇప్పటికే పర్మిషన్ కోసం అప్లై చేశారని సమాచారం.

అసలే ఎన్టీఆర్ కి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. దానికితోడు రాయలసీమలో ఎన్టీఆర్ కి ఉండే క్రేజే వీరు. ఈ లెక్కన కర్నూల్ లో ఈవెంట్ చేస్తే.. లక్షల్లో అభిమానులు వచ్చే అవకాశముంది. అదే జరిగితే వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు కత్తిమీద సాము అవుతుంది. అందుకే పర్మిషన్ వస్తుందా రాదా అనే అనుమానం కూడా మేకర్స్ లో ఉందట. ఒకవేళ అనుమతి రాని పక్షంలో.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో చేయాలని చూస్తున్నారని, అందుకు తగ్గట్టుగా ముందే ప్రణాళికలు రచిస్తున్నారని వినికిడి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.