English | Telugu

దేవర మెంటల్ మాస్ పోస్టర్.. సెప్టెంబర్ 10న పూనకాలే!

సెప్టెంబర్ 27న విడుదల కానున్న 'దేవర' (Devara) సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ మూవీ నుంచి వచ్చే ఒక్కో అప్డేట్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది. తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది. (Devara Trailer On Sep 10th)

నేడు వినాయక చవితి సందర్భంగా 'దేవర' ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. సెప్టెంబర్ 10న ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ప్రత్యేక పోస్టర్ ను వదిలారు. నల్ల దుస్తులు ధరించి, చేతిలో ఆయుధం పట్టుకొని సముద్రతీరంలో నిల్చొని ఉన్న ఎన్టీఆర్ లుక్ పవర్ ఫుల్ గా ఉంది. 'దేవర' నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మరి ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'దేవర'లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.