English | Telugu

సినిమాటోగ్రాఫర్ స్టడీ కామ్ ప్రసాద్ ఇకలేరు

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ స్టడీ కామ్ ప్రసాద్ ఆదివారం ఉదయం తమిళనాడులోని వేలూరులో ఓ హాస్పిటల్ లో కన్నుమూశారు. గతకొంతకాలంగా రక్తసంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం 5:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయన మణిరత్నం, ప్రియదర్శన్, రాంగోపాల్ వర్మ లాంటి ప్రముఖ దర్శకుల సినిమాలకు పనిచేసారు. తెలుగులోకి "నిన్నే పెళ్ళాడతా" చిత్రం ద్వారా పరిచయమయ్యారు. ప్రసాద్ అంత్యక్రియలు ఆయన స్వస్థలమైన అంబాజీపేటలో నేడు జరగనున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటుంది తెలుగువన్.కామ్