English | Telugu

రాజకీయాలకి దూరంగా ఉన్నా విమర్శలా.. ఆ మహిళ ఎదురుతిరిగింది

'మెగాస్టార్ చిరంజీవి'(Megastar Chianjeevi)రీసెంట్ గా 'ఫీనిక్స్'(Phoenix)ఫౌండేషన్ ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లో పాల్గొన్నాడు. చిరంజీవితో పాటు 'హనుమాన్'(Hanuman)మూవీ ఫేమ్ 'తేజ సజ్జ'(Teja sajja)కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి అభిమానులతో పాటు రక్తదానం చెయ్యడం జరిగింది.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతు 'బ్లడ్ డొనేట్ చేసిన వాళ్లందరికీ నా అభినందనలు. ముఖ్యంగా నా బిడ్డ లాంటి తేజ కి నా ప్రత్యేక అభినందనలు. రక్తదానం అనే పేరు చెప్పగానే నేను గుర్తుకు వ స్తున్నానంటే అది నా పూర్వ జన్మ సుకృతం. ఒక జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ మూలంగా నేను బ్లడ్ బ్యాంకు స్థాపించడం జరిగింది. నేను చాలా రోజుల నుంచి రాజకీయాలకి దూరంగా ఉన్నాను. కానీ ఒక నాయకుడు నన్ను అకారణంగా కొన్ని మాటలు అన్నాడు. ఆ తర్వాత ఆ నాయకుడు ఒక విలేజ్ కి వెళ్తే ఒక మహిళ సదరు నాయకుడితో మాట్లాడుతు చిరంజీవిని అన్నన్ని మాటలు అనడానికి మీకు ఎందుకు అనిపించిందని ఎదురుతిరిగింది. సోషల్ మీడియాలో వీడియో చూసి ఆమె వివరాలు కనుక్కున్నాను. చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా నా బిడ్డ ప్రాణాలు నిలిచాయని ఆమె చెప్పడంతో నా హృదయం ఉప్పొంగింది. నేను చేసిన సేవా కారక్రమాలు, పంచిన ప్రేమాభిమానాలే నాకు రక్షణ. అందుకే సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై స్పందించను. నేను చేసిన మంచే అన్నిటికి సమాధానం చెప్తుందని చిరు మాట్లాడాడు.

చిరు అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే సోషియో ఫాంటసీగా తెరకెక్కిన 'విశ్వంభర'(Vishwambhara)అతి త్వరలోనే విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ 'అనిల్ రావిపూడి'(Anil Ravipudi)దర్శకత్వంలో చేస్తున్న మూవీ షూటింగ్ దశలో ఉంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.