English | Telugu

విశాల్ ముప్పై శాతం వడ్డీతో 21 .29 కోట్లు చెల్లించాల్సిందే..చెన్నై హైకోర్టు తీర్పు  

తమిళ చిత్ర పరిశ్రమలో 'విశాల్'(Vishal)కి ఉన్న ప్రత్యేక స్థానం గురించి అందరకి తెలిసిందే. యాక్షన్ సినిమాలకి పెట్టింది పేరైన విశాల్ 2004 లో 'చెల్లమే' అనే మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. గత సంక్రాంతికి వచ్చిన 'మదగజరాజా' తో కలుపుకొని, ఇప్పటి వరకు సుమారు ముప్పై ఐదు చిత్రాల దాకా చెయ్యగా, నిర్మాతగాను వ్యవహరిస్తూ పలు అభిరుచిగల చిత్రాలని అందిస్తు వస్తున్నాడు.

2022 లో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్(Lyca Productions)విశాల్ పై చెన్నై హైకోర్టు లో పిటిషన్ వేసింది. సదరు పిటిషన్ లో విశాల్ తాను నటించిన 'వీరమై వాగే చూడమ్' మూవీ టైంలో 21 .29 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. డబ్బు తిరిగి ఇచ్చే వరకు ఆయన నిర్మించే సినిమా హక్కులని మాకు చెందే విధంగా ఒప్పందం కుదిరింది. కానీ 'వీరమై వాగే చూడమ్' సినిమా హక్కులని విశాల్ వేరే వాళ్లకి ఇచ్చాడని లైకాప్రొడక్షన్స్ తన పిటిషన్ లో పేర్కొంది. అప్పట్నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతుండగా, రీసెంట్ గా ఈ విషయంపై చెన్నై హైకోర్టు తన తీర్పులో, విశాల్ 30 శాతం వడ్డీతో 21 .29 కోట్లు చెల్లించాలని వెల్లడి చేసింది. 'వీరమై వాగే చూడమ్' కి విశాల్ నిర్మాతగాను వ్యవహరించాడు.

కత్తి, ఇండియన్ 2 , దర్బార్, పొన్నియెన్ సెల్వన్ పార్ట్ 1 , పార్ట్ 2 ,చంద్రముఖి 2 , లాల్ సలాం, వేట్టయ్యన్ వంటి చిత్రాలు లైకా సంస్థ నుంచి వచ్చాయి.