English | Telugu

కాకితో డాన్స్ చేసిన బ్ర‌హ్మీ!

మ‌న బ్ర‌హ్మానందం ఏమైనా చేయ‌గ‌ల‌డు. ఏదైనా చేయించ‌గ‌ల‌డు. బ‌ల‌హీన‌మ‌వుతున్న క‌థ‌కు త‌న కామెడీ టానిక్‌తో ప్రాణం పోయ‌గ‌ల‌డు. సినిమా మొత్తాన్ని భుజాల‌పై వేసుకొని న‌డిపించ‌గ‌ల‌డు. ఆఖ‌ర్లో వ‌చ్చి క్రెడిట్ అంతా ప‌ట్టుకెళ్లిపోగ‌ల‌డు. గంట‌కో ల‌క్ష పారితోషికం తీసుకోగ‌ల‌డు. ఇలా బ్ర‌హ్మీతో ఎనీథింగ్ కెన్ పాజుబులే! ఇప్పుడు కాకితో డాన్స్ చేయ‌బోతున్నాడు బ్ర‌హ్మీ. కాకేంటి? బ్ర‌హ్మానందం డాన్సేంటి? అనుకొంటున్నారా? అదేబ‌రి బ్ర‌హ్మానందం గ‌మ్మత్తు. ఈ విచిత్రం గురించి తెలుసుకోవాలంటే దాస‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 151వ చిత్రం ఎర్ర‌బ‌స్సు చూడాల్సిందే. దాస‌రి - విష్ణు క‌ల‌యిక‌లో రూపుదిద్దుకొన్న చిత్రం ఎర్ర బ‌స్సు. ఈనెల 14న విడుద‌ల అవుతోంది. ఇందులో బ్ర‌హ్మానందం కామెడీ భ‌లే పండింద‌ట‌. కాకితో బ్ర‌హ్మానందం చేసే డాన్స్ హైలెట్‌గా నిల‌బ‌డిపోతుంద‌ట‌. ఈ విష‌యాన్ని దాస‌రి స్వ‌యంగా చెప్పుకొచ్చారు. మ‌రి ఎన్నో సినిమాల్ని త‌న భుజ‌స్కంధాల‌పై లేపి నిల‌బెట్టాడు బ్ర‌హ్మీ. ఎర్ర‌బ‌స్సునూ ముందుకు తోసే కెపాసిటీ ఈ సినిమాలో బ్ర‌హ్మానందంకి ఉందంటారా? కాకితో చేసే డాన్స్ ఎంత వ‌ర‌కూ న‌వ్విస్తుంది..? వెయిట్ అండ్ సీ.