English | Telugu

ఉదిరన్ లుక్ లో అదరగొడుతున్న యానిమల్ మూవీ అబ్రార్

యానిమల్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ని పొందిన నటుడు బాబీడియోల్. అబ్రార్ అనే క్యారక్టర్ లో ఒక్క మాట కూడా లేకుండా సైలెంట్ గా నటించి బాబీ పెద్ద బీభత్సాన్నే సృష్టించాడు.ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒకప్పుడు హీరోగా చేసినా కూడా రాని పేరు యానిమల్ తో బాబీ కి వచ్చింది. పైగా యానిమల్ ఘన విజయంలో బాబీ పాత్ర కూడా ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.తాజాగా ఆయన మరోసారి సంచలనాన్ని సృష్టించడానికి రెడీ అయ్యాడు.

బాబీ డియోల్ లేటెస్ట్ గా సూర్య హీరోగా వస్తున్న భారీ ఫాంటసీ అండ్ యాక్షన్ మూవీ కంగువా లో విలన్ గా చేస్తున్నాడు. ఇప్పుడు చిత్ర యూనిట్ తమ సినిమాలోని బాబిడియోల్ లుక్ కి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేసింది. సుమారు వంద మంది దాకా డిఫెరెంట్ లుక్ తో ఉన్న ఆడ మగ మధ్య బాబీడియోల్ ఒక డిఫరెంట్ వస్త్ర ధారణతో ఉన్నాడు. బాబీ లుక్ ని చూస్తుంటే తను ఎంత పవర్ ఫుల్ క్యారక్టర్ ని పోషిస్తున్నాడో అర్ధం అవుతుంది. ఈ మూవీలో బాబీడియోల్ పేరు ఉదిరన్

కంగువాని హిట్ చిత్రాల దర్శకుడు శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ ద్వారా సూర్య తన నటవిశ్వరూపాన్ని చూపించబోతున్నాడు. దిశా పటాని, జగపతి బాబు,యోగి బాబు, నటరాజన్ సుబ్రమణ్యం తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా మ్యూజిక్ సంచలనం దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.యూవీ క్రియేషన్స్ అండ్ స్టూడియో గ్రీన్ లు 300 కోట్ల భారీ బడ్జట్ తో కంగువాని నిర్మిస్తున్నారు.


పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.