English | Telugu

మా ఫ్యామిలీలో ఇద్దరు పద్మవిభూషణులు ఉండడం గర్వంగా ఉంది : ఉపాసన కొణిదెల

జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న పద్మవిభూషణ్‌ అవార్డు మెగాస్టార్‌ చిరంజీవిని వరించింది. దీనిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవిని కొందరు వ్యక్తిగతంగా, కొందరు సోషల్‌ మీడియా ద్వారా అభినందించారు.

ఈ విషయంలో మెగా ఫ్యామిలీ పెద్ద కోడలు, రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మామగారికి అభినందనలు తెలియజేస్తూ సోషల్‌ మీడియాలో వరసగా పోస్టులు పెడుతున్నారు. చిరంజీవికి సంబంధించిన ఒక రేర్‌ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు ఉపాసన.
ఐదుగురు మనవరాళ్లతో చిరు కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. అందులో చిరు ఒడిలో క్లింకార కూడా కనిపించింది. ఇక ఇప్పుడు మరో ఫోటో షేర్‌ చేస్తూ తమ కుటుంబంలో ఇద్దరు పద్మవిభూషణులు ఉన్నారంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఉపాసన తాతగారైన అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి. రెడ్డికి ఆయన అందించిన సేవలకుగానూ 2010లో పద్మవిభూషణ్‌ అందుకున్నారు. ఇప్పుడు తన మామగారు చిరంజీవి పద్మవిభూషణ్‌ అందుకోవడంతో ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు. తమ కుటుంబాలలో ఇద్దరు పద్మవిభూషణులు ఉండడం గర్వంగానూ, గౌరవంగానూ ఉందని ట్వీట్‌ చేశారు. తన తాతగారు డాక్టర్‌ ప్రతాప్‌ సి. రెడ్డితో చిరు కలిసి ఉన్న ఫోటోను షేర్‌ చేశారు ఉపాసన.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.